Minister Jagadeesh Reddy | నాగారం ఘటనపై మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి

Minister Jagadeesh Reddy విధాత‌: స్వగ్రామం నాగరంలో గోడ కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలలో పాల్గొన్న ఆయన తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ తో కలసి హుటాహుటిన సూర్యపేట జిల్లా కేంద్రంలో నీ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల పార్థివ దేహాల వద్ద నివాళులు అర్పించారు. వర్షాల కారణంగా గోడ కూలి మృతి చెందిన ముగ్గురు కుటుంబ […]

  • By: Somu |    latest |    Published on : Aug 03, 2023 2:22 AM IST
Minister Jagadeesh Reddy | నాగారం ఘటనపై మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి

Minister Jagadeesh Reddy

విధాత‌: స్వగ్రామం నాగరంలో గోడ కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలలో పాల్గొన్న ఆయన తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ తో కలసి హుటాహుటిన సూర్యపేట జిల్లా కేంద్రంలో
నీ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల పార్థివ దేహాల వద్ద నివాళులు అర్పించారు. వర్షాల కారణంగా గోడ కూలి మృతి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులకు ఒక్కొరికి నాలుగు లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. అంతే గాకుండా తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 25 వేలు చొప్పున ముగ్గురికి 75 వేల రూపాయలు జగదీష్ రెడ్డి స్వయంగా అంద జేశారు.

వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యావకాశం కల్పించడంతో పాటు వారికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఆయ‌న‌ ప్రకటించారు. వారి మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించిన మంత్రి జగదీష్ రెడ్డి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.