చెట్టెక్కిన మంత్రి జూప‌ల్లి.. ఎందుకంటే..!

పార్లమెంట్ ఎన్నిక‌లు దెగ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో రాష్ట్రంలో ప్ర‌చారాల ప‌ర్వ కొన‌సాగుతున్న‌ది. ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు రాజ‌కీయ‌నేత‌లు రోజు రోజుకు వినూత్న ప‌ద్ద‌తుల‌ను అవ‌లంబిస్తున్నారు

చెట్టెక్కిన మంత్రి జూప‌ల్లి.. ఎందుకంటే..!

విధాత‌: పార్లమెంట్ ఎన్నిక‌లు దెగ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో రాష్ట్రంలో ప్ర‌చారాల ప‌ర్వ కొన‌సాగుతున్న‌ది. ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు రాజ‌కీయ‌నేత‌లు రోజు రోజుకు వినూత్న ప‌ద్ద‌తుల‌ను అవ‌లంబిస్తున్నారు. నాగ‌ర్‌క‌ర్నూల్ పార్ల‌మెంట్ కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌ల్లు ర‌వి త‌రుపున ప్ర‌చారం చేస్తున్న మంత్రి జూప‌ల్లి కృష్ణారావు శ‌నివారం ప్ర‌చారంలో భాగంగా మామిడి చెట్టు ఎక్కి అక్క‌డి కూలీల‌తో మాట్లాడారు.  తాను చెట్టు ఎందుకు ఎక్కాడో చెబూతూ.. నేను కొడంగ‌ల్‌లో 9వ త‌ర‌గతి చ‌దువుకునే రోజుల్లో ఎండాకాలం పిల్ల‌లంతా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల‌ను ఎక్కి చ‌దువుకునే వార‌ని, ఇప్పుడు ఈ మామిడి చెట్టు చూడ‌గానే అప్ప‌టి జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌చ్చాయ‌న్నారు. అందుకే మామిడి చెట్టు ఎక్కాన‌ని మంత్రి జూప‌ల్లి తెలిపారు.