Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటికి తప్పిన హెలికాప్టర్ ప్రమాదం!

తెలంగాణ రెవెన్యూ, సమాచార పౌర శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. కలెక్టరేట్ ప్రాంగణం‌లోని హెలిప్యాడ్ లో పైలట్ హెలికాప్టర్ ను ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేశారు. అయితే బుల్లెట్ అక్కడే ఉన్న గడ్డిపై పడి మంటలు చెలరేగాయి.

  • By: Somu |    latest |    Published on : Apr 19, 2025 5:56 PM IST
Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటికి తప్పిన హెలికాప్టర్ ప్రమాదం!

Ponguleti Srinivas Reddy:  తెలంగాణ రెవెన్యూ, సమాచార పౌర శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. శనివారం భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సుకు హాజరయ్యేందుకు నాగర్‌కర్నూల్ జిల్లా‌కు మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ హెలికాప్టర్‌లో వెళ్లారు. కలెక్టరేట్ ప్రాంగణం‌లోని హెలిప్యాడ్ లో పైలట్ హెలికాప్టర్ ను ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేశారు. అయితే బుల్లెట్ అక్కడే ఉన్న గడ్డిపై పడి మంటలు చెలరేగాయి.

దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మంటలను గమనించి పైలట్ హెలికాప్టర్ ను గాలిలోనే ఉంచి నేలకు దించకపోవడంతో మంత్రి పొంగులేటి బృందానికి పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.