Minister Ponnam | మర్యాదలు..సన్మానాలకు చేనేత వస్త్రాలు వాడండి

తెలంగాణలో చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు అతిధులు, పెద్దలకు మర్యాదలు, సన్మాలు చేయాలనుకుంటే చేనేత టవల్స్‌, వస్త్రాలు వాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విటర్ వేదికగా వీడియో ద్వారా అభ్యర్థించారు

Minister Ponnam | మర్యాదలు..సన్మానాలకు చేనేత వస్త్రాలు వాడండి

ట్వీటర్ వేదికగా మంత్రి పొన్నం వీడియో

విధాత : తెలంగాణలో చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు అతిధులు, పెద్దలకు మర్యాదలు, సన్మాలు చేయాలనుకుంటే చేనేత టవల్స్‌, వస్త్రాలు వాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విటర్ వేదికగా వీడియో ద్వారా అభ్యర్థించారు. రాష్ట్రంలో పేరెన్నికగన్న చేనేత రంగాన్ని కాపాడాలని, ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మీరు తెచ్చే శాలువాలు కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాద పరిచినట్లవుతుందని, కప్పుకుంటే ఆ శాలువలుది ఎందుకు పనికి రావని.. ఎవరికీ ఉపయోగపడవన్నారు.

ఆ శాలువలు ప్లాస్టిక్‌తో సమానమన్నారు. శాలువలు మన దగ్గర తయారయ్యేవి కాదని, దయచేసి కాటన్ వస్త్రాలను ప్రోత్సహించాలని సూచించారు చేనేత టవల్స్ , వస్త్రాలు వాడటం ద్వారా చేనేతలకు ఉపాధి, మనకు సౌకర్యం ఉంటుందన్నారు. లేదంటే పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు ఇవ్వాలని సూచించారు. మంత్రులు, పెద్దలు ఎవరి దగ్గరకు వెళ్లిన చేనేత టవల్స్, లేక పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు లాంటివే ఇవ్వాలని స్పష్టం చేశారు.