Manchirevula | మంచిరేవులలో.. ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రారంభం
Manchirevula | విధాత: రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ మంచిరేవులలో శనివారం ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి ప్రారంభించారు. కోటి వృక్షార్చన లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.7.38 కోట్ల వ్యయంతో 256 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. అర్బన్ లంగ్ స్పేస్ లో భాగంగా […]

Manchirevula |
విధాత: రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ మంచిరేవులలో శనివారం ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి ప్రారంభించారు. కోటి వృక్షార్చన లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.7.38 కోట్ల వ్యయంతో 256 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
అర్బన్ లంగ్ స్పేస్ లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ పార్క్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. వాచ్ టవర్ ఈ పార్క్ లో అదనపు ఆకర్షణ కాగా, గజీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, అంఫి థియేటర్, వాటర్ ఫాల్ సదుపాయాలు కల్పించామన్నారు.
అనంతరం మంత్రలు సఫారీ వాహనంలో పార్కు అంతా కలియ తిరిగారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీఎస్ శాంతికుమారి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్ ఎం డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి పాల్గొన్నారు.