Crocodile | చేపల జాలరిని మింగేసిన రెండు మొసళ్లు..
Crocodile | మొసళ్లు అతి భయంకరమైన సరీసృపాలు. ఇవి జంతువులనే కాదు.. మనషులను కూడా అమాంతం మింగేస్తాయి. ఓ రెండు మొసళ్లు కలిసి చేపల జాలరిపై దాడి చేసి మింగేసిన ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్‌లాండ్స్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఏప్రిల్ 30వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. క్వీన్‌లాండ్స్‌కు చెందిన కెవిన్ డర్మోడి(65) తన స్నేహితులతో కలిసి కెన్నెడీ బెండ్ అనే ఉప్పు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. అక్కడ […]

Crocodile | మొసళ్లు అతి భయంకరమైన సరీసృపాలు. ఇవి జంతువులనే కాదు.. మనషులను కూడా అమాంతం మింగేస్తాయి. ఓ రెండు మొసళ్లు కలిసి చేపల జాలరిపై దాడి చేసి మింగేసిన ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్‌లాండ్స్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఏప్రిల్ 30వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. క్వీన్‌లాండ్స్‌కు చెందిన కెవిన్ డర్మోడి(65) తన స్నేహితులతో కలిసి కెన్నెడీ బెండ్ అనే ఉప్పు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. అక్కడ చేపలు పడుతుండగా.. కెవిన్ నీటిలో అదృశ్యమయ్యాడు. స్నేహితులు ఎంత వెతికినా కెవిన్ ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు, వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం అందించారు.
రెండు రోజుల తనిఖీల తర్వాత కెవిన్ అదృశ్యమైన ప్రాంతం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో రెండు మొసళ్లు కనిపించాయి. అవి రెండు చనిపోయి ఉన్నాయి. అయితే ఆ రెండు మొసళ్ల శరీరం ఉబ్బినట్లు ఉంది. దీంతో వాటి శరీరాలను పరిశీలించగా, అందులో కెవిన్ డెడ్ బాడీ పార్ట్స్ లభ్యమయ్యాయి. అయితే కెవిన్‌పై రెండు మొసళ్లు దాడి చేసినట్లు వైల్డ్ లైఫ్ ఆఫీసర్లు నిర్ధారించారు.
కెవిన్‌కు చేపలు పట్టడంలో మంచి అనుభవం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మొసలి కెవిన్‌ను మింగేయడం బాధను కలిగిస్తుందని తోటి జాలర్లు పేర్కొన్నారు. కెవిన్ జీవితం ఇంత విషాదాంతంగా ముగుస్తుందని అనుకోలేదని తెలిపారు.