మాటలకు.. చేతలకు పొంతన లేని కాంగ్రెస్ పాలన: హరీశ్‌రావు
ఒకటో తారీఖునా జీతాలిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతనలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ.హరీశ్‌రావు ట్విటర్ వేదికగా మండిపడ్డారు
విధాత : ఒకటో తారీఖునా జీతాలిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతనలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ.హరీశ్‌రావు ట్విటర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారని, అయితే అంగన్ వాడీలకు 22 రోజులు గడుస్తున్నా జీతం అందలేదని నిలదీశారు. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని, ప్రభుత్వం తక్షణం స్పందించి, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బంది జీతాలు తక్షణమే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram