MLA Jagadish Reddy | రాజకీయ వెదవలు.. కోమటిరెడ్డి బ్రదర్స్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో వెదవలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని, పదవులు, కాంట్రాక్టుల కోసం వారు నాడు వైఎస్సార్..నేడు సీఎం రేవంత్‌రెడ్డిల బూట్లు తుడుస్తు భజన చేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆరెస్ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

Reported by: Somu | latest | Apr 18, 2024, 2:17 pm IST
Read Time: 4 mins
MLA Jagadish Reddy | రాజకీయ వెదవలు.. కోమటిరెడ్డి బ్రదర్స్‌

పదవుల కోసం నాడు వైఎస్‌…నేడు రేవంత్ భజన
మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఫైర్

విధాత : ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో వెదవలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని, పదవులు, కాంట్రాక్టుల కోసం వారు నాడు వైఎస్సార్..నేడు సీఎం రేవంత్‌రెడ్డిల బూట్లు తుడుస్తు భజన చేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆరెస్ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. గురువారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేను నిఖార్సయిన ఉద్యమకారుణ్ణి.. ఫైటర్‌ను అని, ప్రజల కోసం ఎన్ని సార్లు అయిన జైలుకు పోయే దమ్మున్న నాయకుణ్ణి అని, నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదని మండిపడ్డారు.

కోమటిరెడ్డి సోదరులకు నడిమంతరపు సిరి మాదిరిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కింద మీద ఆగడం లేదన్నారు. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుందని, జిల్లా రాజకీయాల్లో వెదవలని, జిల్లా అన్నదాతలను మోసం చేసి, సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్సార్‌ వద్ద ముడుపులు తీసుకున్న వెదవలని దుయ్యబట్టారు. వైఎస్‌ ఇచ్చిన భిక్షతో బ్రతికోనోళ్లు వీళ్లని, వీళ్లు కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, జాగ్రత్త బిడ్డ లాగు విప్పి కొడతామని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ కి ఓటెయ్యాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏదో ఆగర్భ శ్రీమంతుల్లాగా బిల్డప్ ఇస్తున్నారని, నా చరిత్ర ఎంటో, మీ చరిత్ర ఎంటో చర్చ పెడదామా అని సవాల్ విసిరారు. కోమటిరెడ్డి సోదరుల బలుపు అణగగొడుతామని, జిల్లాకు పట్టిన శని వాళ్లని, సంస్కారం లేని వెదవల్లారా నోరు అదుపులో పెట్టుకోండని హెచ్చరించారు. ప్రజల ముందు మీ బండారం బయటపెడతామన్నారు. లిల్లిఫుట్ గాళ్లు వాళ్లని, రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషేనని, బీజేపీలోకి పోతాడని కాంగ్రెస్‌ మంత్రులే లీక్ లు ఇస్తున్నారని, కేసీఆర్ జోలోకి వస్తే తన్ని తరిమేస్తామని హెచ్చరించారు.