MLA Koushik Reddy| లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జనం బుద్ధి చెబుతారు
420హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో జనం బుద్ధి చెప్పడం ఖామయని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు.

- బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
విధాత: ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు…420హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత విమర్శలు మానకపోతే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జనం బుద్ధి చెప్పడం ఖామయని హుజూరాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఉంటే కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నారని, కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెబుతున్నానని గొంతు పిసికి చంపడని మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు.
కేసీఆర్‌ను ఎందుకు చంపాలని తెలంగాణ తెచ్చినందుకా రైతులకు రైతుబంధు ఇచ్చినందుకా… ఉచిత కరెంటు ఇచ్చినందుకా..ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి ఇచ్చినందుకా..200పింఛన్‌ను 2వేలు చేసినందుకు చంపమంటున్నావా అంటూ నిలదీశారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం కట్టి సాగుతాగునీళ్లు ఇచ్చినందుకు చంపమంటున్నావా అంటూ ప్రశ్నించారు. డిసెంబర్ 9న 2లక్షల మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని హామీలపై ప్రశ్నిస్తే బీఆరెస్ నేతలపై అడ్డగోలు విమర్శలకు దిగుతున్నాడన్నారు. అధికారం ఇచ్చిన ప్రజలకు ఏం చేస్తావో చెప్పుగాని నోరుంది గదా అని అడ్డగోలుగా కేసీఆర్‌ను విమర్శించడం సరికాదన్నారు.