MLA Seethakka | ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ చేయాలి: ఎమ్మెల్యే సీతక్క
MLA Seethakka మల్లంపల్లిని మండలంగా ప్రకటించాలి ఛీఫ్ సెక్రటరీని శాంతకుమారికి ఎమ్మెల్యే సీతక్క వినతి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతకుమారిని కలిసి ఏటూరునాగారం డివిజన్ చేయాలని, మల్లంపల్లి మండలంగా ప్రకటించాలని ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క వినతి పత్రాన్ని అందజేశారు. మంగళవారం సెక్రటేరియట్లో తశాంత కుమారిని సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలాన్ని చుట్టూ ప్రక్కల ఉన్న ఆరు మండలాలతో కలిపి రెవెన్యూ డివిజన్ […]
MLA Seethakka
- మల్లంపల్లిని మండలంగా ప్రకటించాలి
- ఛీఫ్ సెక్రటరీని శాంతకుమారికి ఎమ్మెల్యే సీతక్క వినతి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతకుమారిని కలిసి ఏటూరునాగారం డివిజన్ చేయాలని, మల్లంపల్లి మండలంగా ప్రకటించాలని ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క వినతి పత్రాన్ని అందజేశారు.
మంగళవారం సెక్రటేరియట్లో తశాంత కుమారిని సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలాన్ని చుట్టూ ప్రక్కల ఉన్న ఆరు మండలాలతో కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మల్లంపల్లి గ్రామాన్ని చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజల కోరిక మేరకు మండలంగా ప్రకటించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram