LB Nagar | కేటీఆర్ ప్ర‌సంగిస్తుండ‌గానే.. మాజీ కార్పొరేట‌ర్‌పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచ‌రుల దాడి..

LB Nagar | విధాత: ఎల్‌బీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో వ‌ర్గ విభేదాలు బ‌య‌ట‌ ప‌డ్డాయి. ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవ‌ర్ (RHS Flyover) ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్ర‌సంగిస్తుండ‌గానే, చంపాపేట మాజీ కార్పొరేట‌ర్‌పై ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (MLA Sudheer Reddy) అనుచ‌రులు దాడి చేశారు. దీంతో ఆయ‌న దాడి నుంచి త‌ప్పించుకునేందుకు ప‌రుగెత్తారు. అస‌లేం జ‌రిగిందంటే..? ఎల్‌బీన‌గ‌ర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వానికి మంత్రి […]

LB Nagar | కేటీఆర్ ప్ర‌సంగిస్తుండ‌గానే.. మాజీ కార్పొరేట‌ర్‌పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచ‌రుల దాడి..

LB Nagar |

విధాత: ఎల్‌బీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో వ‌ర్గ విభేదాలు బ‌య‌ట‌ ప‌డ్డాయి. ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవ‌ర్ (RHS Flyover) ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్ర‌సంగిస్తుండ‌గానే, చంపాపేట మాజీ కార్పొరేట‌ర్‌పై ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (MLA Sudheer Reddy) అనుచ‌రులు దాడి చేశారు. దీంతో ఆయ‌న దాడి నుంచి త‌ప్పించుకునేందుకు ప‌రుగెత్తారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

ఎల్‌బీన‌గ‌ర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వానికి మంత్రి కేటీఆర్ శ‌నివారం సాయంత్రం వెళ్లారు. ప్రారంభం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగిస్తుండ‌గా, హ‌స్తినాపురం కార్పొరేట‌ర్ సుజాత నాయ‌క్ (Sujatha Naik) వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చారు.

అదే వేదిక‌పై రెండో వ‌రుసలో చంపాపేట మాజీ కార్పొరేట‌ర్ సామ ర‌మ‌ణా రెడ్డి (Sama Ramana Reddy) కూర్చున్నారు. కార్పొరేట‌ర్ సుజాత నాయ‌క్‌కు ర‌మ‌ణారెడ్డి త‌న కుర్చీని ఇచ్చారు. అయితే ఆమె ముందే ర‌మ‌ణారెడ్డి నిల‌బ‌డ‌టంతో ప‌క్క‌కు జ‌ర‌గ‌మ‌ని సుజాత నాయ‌క్ చెప్పారు. ఈ మాట విన్న సుధీర్ రెడ్డి కూడా ప‌క్క‌కు జ‌ర‌గ‌మ‌ని ర‌మ‌ణారెడ్డికి సూచించారు.

దీంతో ఆగ్ర‌హాంతో ఊగిపోయిన ర‌మణారెడ్డి.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించారు. ఆ ప‌క్క‌న కూర్చోవాల‌ని ర‌మ‌ణారెడ్డికి కేటీఆర్ కూడా సూచించారు. ఈ క్ర‌మంలోనే ర‌మ‌ణారెడ్డిపై వెనుక నుంచి కొంద‌రు దాడి చేశారు.

దీంతో ర‌మ‌ణారెడ్డి అక్క‌డ్నుంచి త‌ప్పించుకుని ప‌రుగెత్తారు. ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. సుధీర్ రెడ్డి అనుచ‌రులు ర‌మ‌ణారెడ్డిని అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించారు.