Modi | పదేండ్ల తర్వాత.. మీడియా ప్రశ్నకు మోదీ సమాధానం! ప్రధాని హోదాలో ప్రప్రథమం
Modi పదేండ్లలో ప్రధానమంత్రి హోదాలో ఇదే ప్రప్రథమం జో బైడెన్‌తో కలిసి వైట్‌హౌస్‌లో సంయుక్త ప్రెస్‌మీట్ భారత ప్రజాస్వామ్యంపై మోదీని ప్రశ్నించిన వైట్‌హౌస్ రిపోర్టర్ సబ్రీనా సిద్ధిఖీ.. ఈమె ఎవరో తెలుసా? విధాత: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యంత అరుదైన ఘటనను ఎదుర్కొన్నారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తొలిసారిగా మీడియాను ఫేస్‌చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వడం ఇదే ప్రప్రథమం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి వైట్‌హౌస్‌లో ఈ నెల […]

Modi
- పదేండ్లలో ప్రధానమంత్రి హోదాలో ఇదే ప్రప్రథమం
- జో బైడెన్‌తో కలిసి వైట్‌హౌస్‌లో సంయుక్త ప్రెస్‌మీట్
- భారత ప్రజాస్వామ్యంపై మోదీని ప్రశ్నించిన వైట్‌హౌస్
- రిపోర్టర్ సబ్రీనా సిద్ధిఖీ.. ఈమె ఎవరో తెలుసా?
విధాత: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యంత అరుదైన ఘటనను ఎదుర్కొన్నారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తొలిసారిగా మీడియాను ఫేస్‌చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వడం ఇదే ప్రప్రథమం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి వైట్‌హౌస్‌లో ఈ నెల 22న సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంలో ప్రధాని మోదీ మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
2019లో ఒక్కసారి ప్రెస్‌మీట్
2014లో ప్రధానిగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ ఒక్క మీడియా సమావేశంలో కూడా మాట్లాడలేదు. ఆయన మే 2019లో విలేకరుల సమావేశానికి హాజరయ్యారు. కానీ, ఎలాంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఇతర ప్రపంచ నాయకులతో వైట్ హౌస్‌లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ఖచ్చితంగా నియంత్రించబడ్డాయి. దేశీయ, అంతర్జాతీయ మీడియా రిపోర్టర్‌లను వైట్‌హౌస్ అధికారులు ముందుగానే ఎంపిక చేస్తారు. ప్రశ్నలు కూడా చాలా పరిమితంగా ఉంటాయి.
భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు
వైట్‌హౌస్ రిపోర్టర్ సిద్ధిఖీ భారత ప్రజాస్వామ్యంపై ప్రధాని మోదీని ప్రశ్నించారు. @మీ దేశంలోని ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కులను మెరుగుపరచడానికి, వాక్‌స్వేచ్ఛను సమర్థించడానికి మీరు, మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు’ అని ప్రశ్నించారు. దీనికి ప్రధాని స్పందించారు.
ప్రజాస్వామ్యంపై భారతదేశ రికార్డును, తన ప్రభుత్వ పనితీరును, మానవ హక్కులను ప్రధాని మోదీ సమర్థించుకున్నారు. తమ ప్రభుత్వం సబ్‌కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కావిశ్వాస్, సబ్ కా ప్రయాస్* అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరి ఎదుగుదల కోసం, అందరి నమ్మకంతో కలిసి పని చేస్తున్నదని చెప్పారు.
సబ్రినా సిద్ధిఖీ ఎవరంటే..
సబ్రినా సిద్ధిఖీ ఉన్నత స్థాయి ముస్లిం అమెరికన్ జర్నలిస్టుల్లో ఒకరు. ఆమె వాషింగ్టన్ డీసీలోని ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు వైట్ హౌస్ రిపోర్టర్. అక్కడ ఆమె బైడెన్ ప్రెసిడెన్సీని కవర్ చేస్తున్నారు. ఆమె 2019కి ముందు గార్డియన్‌లో పనిచేస్తున్నప్పుడు వైట్‌హౌస్, 2016 అధ్యక్ష ఎన్నికలను కూడా కవర్ చేశారు. సిద్ధిఖీ నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. ఆమె భర్తతో కలిసి వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు.