Medaram Jatara : మేడారం జాతరలో వారు ‘పరిశుద్ధులు’…అంటురోగాలు వెంటాడకుండా చర్యలు

మేడారం జాతరలో సుమారు 5,000 సానిటేషన్ సిబ్బంది భక్తుల ఆరోగ్యాన్ని కాపాడుతూ 24 గంటల పాటు పరిశుభ్రత, చెత్త సేకరణ, వైద్య సేవలు అందిస్తున్నారు.

Medaram Jatara : మేడారం జాతరలో వారు ‘పరిశుద్ధులు’…అంటురోగాలు వెంటాడకుండా చర్యలు

విధాత, ప్రత్యేకప్రతినిధి: మేడారం జాతరలో మంత్రుల హంగామా, ప్రజాప్రతినిధుల హడావుడి, అధికార పార్టీ నేతల పటాటోపం, ప్రతిపక్ష నేతల సందర్శన, అధికారుల బాధ్యత, పోలీసుల అతిజోక్యం, మీడియా గోలగోలల మధ్య పెద్దగా గుర్తింపునకు నోచుకుని సానిటేషన్ సిబ్బంది బాధ్యత అత్యంత కీలకమైనది. అపరిశుభ్రతతో సహజీవనం చేస్తూ అందరికీ పారిశుధ్యాన్ని, ఆరోగ్యాన్ని అందించేందుకు శ్రమించే పంచాయితీ రాజ్, మున్సిపల్, సానిటేషన్ సిబ్బంది చేసే పని తమతమ విధుల్లో భాగస్వామ్యమైనవేకావచ్చు…కాని ఈ విధులు ఎంతో వెలకట్టలేనివి.

మేడారం లాంటి చోట విధులు భేష్

కనీస వసతులు లేని మారుమూల కుగ్రామమైన మేడారం లాంటి చోటికి తక్కువలో తక్కవగా మూడు నెలల ముందుగా ప్రారంభయ్యే రద్దీకి తోడు జాతర సందర్భంగా తరలివచ్చే లక్షలాది విచ్చలవిడిగా, కనీస క్రమశిక్షణ, బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా విసర్జించే మలమూత్రాలతోపాటు, మద్యం సీసాలు, ప్లాస్టిక్, కాగితం పేపర్లు,బెల్లం, కొబ్బరి చిప్పలు, కోళ్ళు, మేకల వ్యర్ధాలు ఒక్కటేమిటీ సకలరంగల సమాహారంగా ఉండే వస్తువులు, పదార్ధాలు, వ్యర్ధాలు అన్నీ గుట్టలుగా పోగుపడుతుంటాయి. ఒక గంటో, రోజులో అక్కడి నుంచి వాటిని తొలగించి, ఊడ్చి శుభ్రం చేసి అవసరమైన మందులు చల్లకుంటే ఒక్క క్షణం అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొంటొంది. కనీస బాధ్యత లేకుండా పడవేసే వస్తువులను ఏరి, పోగుచేసి ఎప్పటికప్పుడూ తొలగించినా ఇంకా గుట్టలుగా చెత్తా చెదారం మనకు దర్శనమిస్తుంటోంది. ఇటు కార్యక్రమాలు చేయడంలో రేయింబవళ్ళు శ్రమించే మున్సిపల్, పంచాయతీరాజ్, హెల్త్ వర్కర్స్ అధికారి నుండి కిందిస్థాయి పారిశుధ్య కార్మికుల వరకు వారి పని విధానం ఎంతో ముఖ్యమైన పాత్ర నిర్వహించాయి. పైగా జాతర జరిగే ప్రాంతం, శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క బాధ్యత వహిస్తున్నందున ఏ మాత్రం తేడా వచ్చినా అధికారులూ, సిబ్బంది ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటోంది. ఈ సారి మేడారం జాతరలో సుమారు 5 వేల మంది నిత్యం 24 గంటలు అందుబాటులో ఉంటూ రోడ్లు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం నిర్వహణ చేస్తూ సేవలు అందిస్తున్నారు, జాతరకు నెల రోజుల ముందు నుండి పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతర సమయంలోనే కాకుండా తదుపరి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ ప్రధానమైంది. ఆ బాధ్యత నిర్వహిస్తామంటూ సంబంధిత అధికారులు చెప్పారు, ఈ కార్యక్రమంలో తెలంగాణతోపాటు ఆంధ్ర ప్రదేశ్ నుండి ఈ హెల్త్ సానిటేషన్ వర్కర్లను జాతర నిమిత్తం తీసుకున్నారు. వీరికి తోడు డిపిఓ, డివిజనల్ పిఓలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు, తదితరులు నిత్యం అమ్మవారి గద్దెల ప్రాంగణం, కార్యాలయాలు, అధికారుల నివాస ప్రాంతాలు, రహదారుల వెంబడి, మరుగుదొడ్ల పరిశుభ్రత, క్లీనింగ్ , బ్లీచింగ్ తదితర ప్రదేశాలలో అంకిత భావంతో సానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెల్త్ సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. సేకరించిన చెత్తను, వేస్టేజ్ ని ప్రత్యేక ట్రాక్టర్లు,ట్రాలీ ఆటోలు తదితర వాహనల ద్వారా సెక్రిగేషన్ చేసి తరలిస్తున్నారు. జాతర నిర్వహణలో గ్రామీణ మంచినీటి సరఫరా త్రాగునీరు అందించడం, హెల్త్ శానిటేషన్ పనులు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్ తదితర మహా జాతరలో సెక్టార్ విభాగాల వారీగా వీరు విధులు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

India’s First Offshore Airport | అరేబియా సముద్రంపై దేశ తొలి విమానాశ్రయం.. ముంబైలో టెక్నాలజీ అద్భుతం
Nirmala Sitharaman : నిర్మలమ్మ బడ్జెట్‌ టీమ్‌ ఇదే.. తొలిసారి శక్తిమంతమైన మహిళకు చోటు.. ఫుల్‌ డీటెయిల్స్ ఇవే..!