Balagam: మోహన్ బాబు ఫిదా.. ‘బలగం’ టీమ్‌ని ఇంటికి పిలిపించుకుని మరీ!
విధాత: చిన్న సినిమా. ఒక్క ప్రియదర్శి మినహా నోటెడ్ ఆర్టిస్ట్‌లు ఎవరూ లేరు. కానీ ఒక సినిమా హిట్టవడానికి, జనాలను మెప్పించడానికి చిన్న, పెద్ద తేడా అనేది ఉండదని నిరూపించింది ‘బలగం’. ఈ చిత్రమే కాదు.. గతంలో కూడా చాలా చిత్రాలు.. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి.. పెద్ద చిత్రాలకు పోటీగా నిలిచాయి. అంతెందుకు మొన్నీ మధ్య వచ్చిన ‘కాంతార’ చిత్రమే తీసుకుంటే.. కేవలం రూ. 16 కోట్లతో తెరకెక్కిన ఆ చిత్రం దాదాపు రూ. 400 కోట్లను […]

విధాత: చిన్న సినిమా. ఒక్క ప్రియదర్శి మినహా నోటెడ్ ఆర్టిస్ట్‌లు ఎవరూ లేరు. కానీ ఒక సినిమా హిట్టవడానికి, జనాలను మెప్పించడానికి చిన్న, పెద్ద తేడా అనేది ఉండదని నిరూపించింది ‘బలగం’. ఈ చిత్రమే కాదు.. గతంలో కూడా చాలా చిత్రాలు.. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి.. పెద్ద చిత్రాలకు పోటీగా నిలిచాయి.
అంతెందుకు మొన్నీ మధ్య వచ్చిన ‘కాంతార’ చిత్రమే తీసుకుంటే.. కేవలం రూ. 16 కోట్లతో తెరకెక్కిన ఆ చిత్రం దాదాపు రూ. 400 కోట్లను రాబట్టింది. ఇది కదా విజయమంటే. ఇది కదా సునామీ అంటే. కలెక్షన్లపరంగా పక్కన పెడితే.. టాక్ పరంగా మాత్రం ‘కాంతార’కు మించిన సునామీని ‘బలగం’ సృష్టిస్తోంది. ఈ సినిమా చూసి.. కంట నీరు పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కానే కాదు.
అందుకే ఒకవైపు ఓటీటీలోకి వచ్చినా కూడా.. థియేటర్లలో ఇంకా భారీగానే ఈ సినిమా కలెక్షన్స్‌ని రాబడుతోంది. సినిమా చూసిన వారు.. చిత్రయూనిట్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. మొన్న చిరంజీవి, కేటీఆర్.. ఇలా ప్రతి ఒక్కరూ యూనిట్‌ను అభినందిస్తూ సత్కరిస్తున్నారు. ఇప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వంతు వచ్చింది.
‘బలగం’ సినిమాని చూసిన మంచు మోహన్ బాబు.. చిత్రయూనిట్‌ను ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు. శాలువాలు కప్పి సత్కరించారు. సరదాగా కాసేపు గడిపారు. ‘బలగం’ సినిమా వెనుక ఉన్న కథని అడిగి తెలుసుకున్నారు. ఆప్యాయతగా వారిని పలకరించి.. దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. అంతలా మోహన్ బాబుని ఈ సినిమా కదిలించింది. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా ఇందులో భాగమయ్యారు. ఆయన కూడా చిత్రయూనిట్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రస్తుతం మోహన్ బాబు ‘బలగం’ టీమ్‌ను అభినందిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వంలో ‘బలగం’ చిత్రం రూపొందింది. ‘పిట్టకు పెట్టుడు, పిట్ట ముట్టుడు’ కాన్సెఫ్ట్‌తో.. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ.. ఒక్కొక్కరిని కంటతడి పెట్టిస్తుంది.
గొడవలతో దూరమైన అన్నదమ్ములను మళ్లీ ఒక్కటి చేస్తుంది. చిన్న చిన్న తగాదాలతో విడిపోయిన కుటుంబాలను ఏకం చేస్తుంది. మొత్తంగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటూ.. మాములు అవార్డ్స్‌నే కాకుండా అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లగొడుతోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దిల్ రాజు సమర్పించారు.