10th Exams | పది పరీక్షల్లో.. పర్యవేక్షణ లోపాలు.! గోడలు, కిటికీలు ఎక్కి చిట్టీలు

విధాత: పదవ తరగతి పరీక్షలు (10th Class Exams) నిర్వాహణ జిల్లాల్లో పర్యవేక్షణ లోపంతో సాగుతున్నాయి. వికారాబాద్‌లో పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఘటన చోటు చేసుకున్నప్పటికీ పరీక్షల నిర్వహణలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా విఫలమవుతుంది. మంగళవారం నకిరేకల్ పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాల భవనంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగానే వారి సంబంధికులు బయట నుంచి గోడలు, కిటికీలు ఎక్కి చిట్టీలు అందిస్తున్న చిత్రాలు, వీడియోలు […]

  • By: Somu |    latest |    Published on : Apr 04, 2023 5:38 AM IST
10th Exams | పది పరీక్షల్లో.. పర్యవేక్షణ లోపాలు.! గోడలు, కిటికీలు ఎక్కి చిట్టీలు

విధాత: పదవ తరగతి పరీక్షలు (10th Class Exams) నిర్వాహణ జిల్లాల్లో పర్యవేక్షణ లోపంతో సాగుతున్నాయి. వికారాబాద్‌లో పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఘటన చోటు చేసుకున్నప్పటికీ పరీక్షల నిర్వహణలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా విఫలమవుతుంది.

మంగళవారం నకిరేకల్ పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాల భవనంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగానే వారి సంబంధికులు బయట నుంచి గోడలు, కిటికీలు ఎక్కి చిట్టీలు అందిస్తున్న చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

అయితే.. వారిని అడ్డుకొని అక్కడి నుంచి పంపించేందుకు అధికారులు కానీ, పోలీసులు కానీ ఎవరు అందుబాటులో లేకపోవడంతో పరీక్ష కేంద్రాల వద్ద ఇతరుల ఆగడాలు సాగుతున్నాయి. నిజానికి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ అందుకు తగ్గ బందోబస్తు లేకపోవడం పది పరీక్షల నిర్వహణలోని డొల్లాతనాన్ని చాటుతుంది.