వ్యక్తి మృతదేహానికి నివాళులర్పించి.. రోదించిన కొండంగి (వీడియో వైరల్)
విధాత: ఇది హృదయాన్ని కలిచి వేసే ఘటన. ఓ వ్యక్తి చనిపోవడంతో అతన్ని మృతదేహాన్ని ఇంటి బయట ఉంచారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆ మృతదేహం వద్ద బోరున విలపిస్తున్నారు. అదే సమయంలో ఆ మృతదేహం వద్దకు ఓ కొండెంగ చేరింది. ఆ డెడ్ బాడీని చూసి చలించిపోయింది. బరువైన హృదయంతో రోదించింది. ముఖంపై ముద్దు పెట్టింది. పైకి లే అంటూ చేతి పట్టుకుని కదిపింది. కొండెంగ చూపించిన అభిమానానికి అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. శ్రీలంకలోని […]

విధాత: ఇది హృదయాన్ని కలిచి వేసే ఘటన. ఓ వ్యక్తి చనిపోవడంతో అతన్ని మృతదేహాన్ని ఇంటి బయట ఉంచారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆ మృతదేహం వద్ద బోరున విలపిస్తున్నారు. అదే సమయంలో ఆ మృతదేహం వద్దకు ఓ కొండెంగ చేరింది. ఆ డెడ్ బాడీని చూసి చలించిపోయింది. బరువైన హృదయంతో రోదించింది. ముఖంపై ముద్దు పెట్టింది. పైకి లే అంటూ చేతి పట్టుకుని కదిపింది. కొండెంగ చూపించిన అభిమానానికి అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు.
శ్రీలంకలోని బాటికాలోయలో ఇటీవలే ఓ వ్యక్తి మరణించాడు. దీంతో ఆ వ్యక్తి మృతదేహాన్ని ఇంటి బయట కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. బంధువులు వచ్చి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నారు. అంతలోనే ఓ కొండెంగ కూడా అక్కడకు వచ్చింది. మృతదేహం వద్దకు చేరుకుని ముఖంపై ముద్దు పెట్టింది. చేయి పట్టుకుని లేపేందుకు ప్రయత్నించింది.
అక్కడున్న వారు దాన్ని పంపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ కొండెంగ వెళ్లలేదు. తనకు నిత్యం అన్నం పెట్టే వ్యక్తి చనిపోయాడు కదా అని విలపించింది ఆ కొండెంగ. ఆ జంతువు బాధను చూసి అక్కడున్న వారంతా మరింత భావోద్వేగాలకు లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొండెంగ ప్రేమ, అభిమానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్ని జంతువులు మానవులను విశ్వసిస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొంటున్నారు.