Kerala | కన్నతల్లి అమానుషం.. భర్తపై కోపంతో 2 నెల బిడ్డను..
బిడ్డలను ఏ కన్నతల్లి అయినా.. కంటికి రెప్పలా కాపుడుతుంది. కానీ, ఓ తల్లి మాత్రం బిడ్డ పట్ల అమానుషం ప్రవర్తించింది.

- భర్తపై కోపంతో 2 నెల బిడ్డను వదిలివెళ్లిన వైనం
- కేరళలోని పాలక్కాడ్‌లో జిల్లాలో దారుణ ఘటన
Kerala | విధాత: బిడ్డలను ఏ కన్నతల్లి అయినా.. కంటికి రెప్పలా కాపుడుతుంది. కానీ, ఓ తల్లి మాత్రం బిడ్డ పట్ల అమానుషం ప్రవర్తించింది. భర్తపై కోపంతో రెండు నెలల పసికందును వదిలేసి వెళ్లిపోయింది. ఈ అమానవీయ ఘటన కేరళలోని పాలక్కాడ్‌లో చోటుచేసుకున్నది. అస్సాంకు చెందిన తల్లి, తన భర్తతో గొడవ పడింది. ఆ తర్వాత ఆమె తన నవజాత శిశువును సోమవారం వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
కసబా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఎవరు లేకుండా ఒంటరిగా రెండు నెలల పాప ఏడుపు విన్నఅక్కడ లాటరీలు విక్రయించే మహిళ విజయకుమారి పోలీసులకు సమాచారం అందించారు. శిశు సంక్షేమశాఖ అధికారులు పాపను మలంబుజ ఆనంద భవనానికి తరలించారు. ఆ దంపతులకు బిడ్డ అక్కర్లేదని, అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మేద్దామని ముందుగానే ప్లాన్ చేసుకున్నారని, తమ దర్యాప్తులో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.
తమ బిడ్డను విక్రయించడం వల్ల జరిగే పరిణామాలపై పోలీసులు వారికి అవగాహన కల్పించారు. పాపను చూసుకుంటామని దంపతులు పోలీసులకు హామీ ఇచ్చి తీసుకెళ్లారు. మళ్లీ ఆలుమగల మధ్య గొడవ జరగడంతో ఆదివారం ఉదయం తల్లి బిడ్డను వదిలి వెళ్లిపోయింది. భార్య వెళ్లగానే ఆమె వెతకడానికి తండ్రి బయటికి వెళ్లాడు.
ఒంటరిగా పాప ఏడుస్తుండగా చూసిన లాటరీ అమ్మే మహిళ విజయకుమారి అప్పుడే పుట్టిన బిడ్డను చూసుకున్నది. అనంతరం కసబా పోలీసులకు సమాచారం అందించింది. తల్లి ఆచూకీపై నివేదిక ఇవ్వాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) కోరింది. తల్లి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.