Infant | పసిపాపకు దగ్గు సిరప్ అనుకొని పురుగుల మందు ఇచ్చిన తల్లి..
Infant | ఓ తల్లి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తన నాలుగు రోజుల పసికందుకు దగ్గు సిరప్ (Cough Syrup) అనుకొని పురుగుల మందు (Insecticide) ఇచ్చింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ శిశువు (Infant) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని కొర్బా జిల్లా (Korba Dist)లోని దదర్‌కాలా గ్రామానికి చెందిన ఓ వివాహిత నాలుగు రోజుల క్రితం పండంటి ఆడబిడ్డ (Girl Child)కు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువుకు తీవ్రమైన […]
Infant | ఓ తల్లి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తన నాలుగు రోజుల పసికందుకు దగ్గు సిరప్ (Cough Syrup) అనుకొని పురుగుల మందు (Insecticide) ఇచ్చింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ శిశువు (Infant) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని కొర్బా జిల్లా (Korba Dist)లోని దదర్‌కాలా గ్రామానికి చెందిన ఓ వివాహిత నాలుగు రోజుల క్రితం పండంటి ఆడబిడ్డ (Girl Child)కు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువుకు తీవ్రమైన దగ్గు రావడంతో.. తల్లి దగ్గు సిరప్ అనుకొని పురుగుల మందు తాగించింది.
దీంతో పసిపాప తీవ్ర అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు కొర్బా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాపకు వైద్యులు చికిత్స అందించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. పసిపాప కోలుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram