Woman Murder | మహిళ దారుణ హత్య.. శరీర భాగాలను కుక్కర్‌లో ఉడికించాడు..
Woman Murder | ఓ వ్యక్తి క్రూర మృగంలా ప్రవర్తించాడు. తనతో సహజీవనం చేస్తున్న మహిళను అతి కిరాతకంగా నరికి చంపాడు. అంతటితో ఆగకుండా శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అంతే కాదు.. ఆ ముక్కలను కుక్కర్‌లో ఉడికించి పైశాచిక ఆనందం పొందాడు. ఈ అత్యంత దారుణ ఘటన ముంబైలోని మీరా రోడ్డులో బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మనోజ్ సహానీ(56), సరస్వతి వైద్య(36) మూడేండ్ల నుంచి సహజీవనంలో ఉన్నారు. వీరిద్దరూ మీరా […]
Woman Murder | ఓ వ్యక్తి క్రూర మృగంలా ప్రవర్తించాడు. తనతో సహజీవనం చేస్తున్న మహిళను అతి కిరాతకంగా నరికి చంపాడు. అంతటితో ఆగకుండా శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అంతే కాదు.. ఆ ముక్కలను కుక్కర్‌లో ఉడికించి పైశాచిక ఆనందం పొందాడు. ఈ అత్యంత దారుణ ఘటన ముంబైలోని మీరా రోడ్డులో బుధవారం సాయంత్రం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మనోజ్ సహానీ(56), సరస్వతి వైద్య(36) మూడేండ్ల నుంచి సహజీవనంలో ఉన్నారు. వీరిద్దరూ మీరా రోడ్డులోని గీతా ఆకాశ్ దీప్ భవనంలోని 704 ప్లాట్‌లో నివాసముంటున్నారు. మనోజ్, సరస్వతి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు చోటు చేసుకుంటున్నాయి.
అయితే నాలుగైదు రోజుల క్రితం ఆ గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో సరస్వతిని సహానీ కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత చెట్లను కత్తిరించే యంత్రంతో ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేశాడు. ఇక ఆమె శరీర భాగాలను కుక్కర్‌లో ఉడికించి పైశాచిక ఆనందం పొందాడు.
బుధవారం సాయంత్రం వారిద్దరూ ఉండే నివాసం నుంచి దుర్వాసన వెదజల్లడంతో మిగతా ప్లాట్ల వారు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళా శరీర భాగాలను, కుక్కర్‌ను, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram