Murders | ఉమ్మడి వరంగల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరి హత్య
Murders, Warangal సంగెం సమీపంలో మహిళ దారుణ హత్య ఈదుల పూసపల్లిలో యువకుడి హత్య విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వేరువేరు సంఘటనలో ఇద్దరినీ హత్య హత్య చేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లార్గూడ శివారు లో గుర్తుతెలియని మహిళను హత్య చేయగా మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసల పల్లిలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. లో దారుణ హత్య జరిగింది. ఆదివారం వెలుగు చూసిన ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలు […]

Murders, Warangal
- సంగెం సమీపంలో మహిళ దారుణ హత్య
- ఈదుల పూసపల్లిలో యువకుడి హత్య
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వేరువేరు సంఘటనలో ఇద్దరినీ హత్య హత్య చేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లార్గూడ శివారు లో గుర్తుతెలియని మహిళను హత్య చేయగా మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసల పల్లిలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. లో దారుణ హత్య జరిగింది. ఆదివారం వెలుగు చూసిన ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ జిల్లా సంగెం మండలం మండలంలోని పళ్ళారుగూడ శివారు వంజరపల్లి గ్రామానికి వెళ్లే దారిలో గుర్తు తెలియని మహిళను హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు సీఐ శ్రీనివాస్, ఎస్సై భరత్ క్లూస్ టీం తో వచ్చి వివరాలు ఆరా తీసుస్తున్నారు. మహిళ ముఖo పై తీవ్ర గాయాలయ్యా యి. ముఖాన్ని గుర్తు పట్టలేని విధంగా చిత్రం చేశారు. చున్నీ తో ఉరివేసి చంపేసినట్లుగా అనుమానిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
మహబూబాబాద్ జిల్లాలో యువకుడి హత్య
మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లిలో దారుణం జరిగింది. పూస పల్లికి చెందిన ఉమర్ అనే యువకుడిని గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. హత్యకు పాల్పడిన దుండగులు ఉమర్ మృతదేహాన్ని ఇంటి ముందు తెచ్చిపడేశారు. ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేసినట్టు భావిస్తున్నారు అయితే హంతకులు ఎవరు ఈ సంఘటనకు కారకులు ఎవరనే విషయం పోలీసులు కూపీ లాగుతున్నారు.