Mahesh Babu | పౌరాణిక పాత్ర.. మహేష్ బాబు డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసేదెవరో..?

Mahesh Babu | విధాత: ప్రతి నటుడికీ తనకంటూ డ్రీం ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేస్తేనే నటుడిగా తన కెరీర్ సక్సెస్ అయినట్టని నమ్మేవారు సినీ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. గతంలోనూ చాలామంది హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు అన్ని పాత్రలు చేస్తూనే.. మధ్యలో తమకు నచ్చిన క్యారెక్టర్ చేసి ఆ పాత్రల్లో జీవించి మెప్పించారు. ఇక ప్రేక్షకులు కూడా ఆ సినిమాలను మెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా నటనకు ప్రాధాన్యం ఉన్న […]

  • Publish Date - August 27, 2023 / 06:25 AM IST

Mahesh Babu |

విధాత: ప్రతి నటుడికీ తనకంటూ డ్రీం ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేస్తేనే నటుడిగా తన కెరీర్ సక్సెస్ అయినట్టని నమ్మేవారు సినీ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. గతంలోనూ చాలామంది హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు అన్ని పాత్రలు చేస్తూనే.. మధ్యలో తమకు నచ్చిన క్యారెక్టర్ చేసి ఆ పాత్రల్లో జీవించి మెప్పించారు. ఇక ప్రేక్షకులు కూడా ఆ సినిమాలను మెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు, భక్తిరస చిత్రాల్లో నటించాలని ఉవ్విళ్ళూరే నటులను ఎప్పుడూ వెనకుండి సపోర్ట్ చేస్తూనే ఉంటారు ప్రేక్షకులు.

ఇక సీనియర్ నటులకే కాదు.. ఈతరం నటులకు కూడా డ్రీమ్ ప్రాజెక్టులు ఉన్నాయట.. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రిన్స్ మహేష్ బాబుకి కూడా ఎప్పటినుంచో ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ మిగిలిపోయిందట. తన కెరియర్‌లో చాలా సినిమాలతో మెప్పించిన సూపర్ స్టార్ మహేష్ చేయాల్సిన సినిమా ఇంకా మిగిలి ఉండిపోయిందని మహేష్ ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.

తనకి భక్తి ప్రధానమైన, పౌరాణికి తరహా సినిమా చేయాలని ఎప్పటినుంచో కోరిక ఉందట. ‘యువరాజు’ మూవీ చేస్తున్నప్పుడు ఓ రెండు సెకన్లపాటు కృష్ణుడిగా కనిపించానని, మళ్ళీ అలాంటి పాత్ర చేద్దామంటే వీలుపడలేదని, మనసులో ఉన్న కోరికను బయటపెట్టాడు మహేష్.

నిజంగానే కృష్ణుడి పాత్రకు మహేష్ బాబు నప్పుతాడు. అయినా ఇదంతా జరగాలంటే మంచి కథను సిద్ధం చేసుకుని భక్తి పరమైన సినిమా చేసేందుకు మన మేకర్స్ ముందుకు రావాలి కదా. అన్ని సక్రమంగా జరిగి.. రాజమౌళి కనుక ‘మహాభారతం’ మొదలెడితే.. ఖచ్చితంగా మహేష్ కోరిక తీరుతుందనే వారు లేకపోలేదు.

చూద్దాం మహేష్ డ్రీమ్ ఎప్పటికి తీరుతుందో? ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే వెంటనే రాజమౌళితో మరో ప్రాజెక్ట్ యాక్షన్ అడ్వంచర్ తరహా ఫిల్మ్ రెడీగా ఉంది. కాకపోతే వచ్చే ఏడాదిలో మాత్రమే మహేష్ సినిమాలు రిలీజ్ అవుతాయి. అదీ సమ్మర్ తర్వాత. ఈలోపు మహేష్ సినిమా లేనట్టే.

Latest News