Mythri Movie Makers | మైత్రీ ఆఫీసులపై దాడుల్లో కీలక సమాచారం.. ఆ హీరోలు కూడా బుక్కయినట్లేనా!

Mythri Movie Makers విధాత‌: మైత్రీ మూవీ మేకర్స్.. సినిమాల పరంగానే కాకుండా.. గత వారం రోజులుగా ఐటీ దాడుల విషయం లోనూ ఈ పేరు వైరల్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఆఫీసులలో ఏప్రిల్ 19 నుంచి 24వ తేదీ వరకు దాదాపు 5 రోజుల పాటు జరిగిన సోదాల్లో.. పలు కీలక సమాచారాన్ని ఐటీ అధికారులు రాబట్టినట్లుగా తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. వాస్తవానికి 5 రోజుల పాటు ఈ దాడులు […]

Mythri Movie Makers | మైత్రీ ఆఫీసులపై దాడుల్లో కీలక సమాచారం.. ఆ హీరోలు కూడా బుక్కయినట్లేనా!

Mythri Movie Makers

విధాత‌: మైత్రీ మూవీ మేకర్స్.. సినిమాల పరంగానే కాకుండా.. గత వారం రోజులుగా ఐటీ దాడుల విషయం లోనూ ఈ పేరు వైరల్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఆఫీసులలో ఏప్రిల్ 19 నుంచి 24వ తేదీ వరకు దాదాపు 5 రోజుల పాటు జరిగిన సోదాల్లో.. పలు కీలక సమాచారాన్ని ఐటీ అధికారులు రాబట్టినట్లుగా తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

వాస్తవానికి 5 రోజుల పాటు ఈ దాడులు జరిగినా.. ఏ విషయాన్ని ఐటీ అధికారులు బయటికి రానివ్వలేదు. అయితే ఎంత పకడ్బందీగా వారు సోదాలు చేసినా.. ఏదో ఒక రకంగా వాటికి సంబంధించిన వివరాలు బయటికి లీక్ అవుతూనే ఉన్నాయి.

ఐటీ అధికారులు జరిపిన ఈ సోదాల్లో భారీగా హవాలా మనీని కనుగొన్నట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల రూపంలో సుమారు రూ. 700 కోట్లు ఈ సంస్థకు చేరినట్లు ఐటీ అధికారులు కనుగొన్నారు. అంతేకాదు, ప్రస్తుతం మైత్రీలో నిర్మితమవుతోన్న ఓ సీక్వెల్ చిత్ర హీరోకి, అలాగే త్వరలో బాలీవుడ్‌లో చేయబోతోన్న చిత్ర దర్శకుడికి భారీ మొత్తంలో హవాలా రూపంలో మనీ ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా.. ఇంతకు ముందు ఈ బ్యానర్‌లో చేసిన ఇద్దరు స్టార్ హీరోలకు కూడా భారీ మొత్తంలో అనుమానాస్పద రీతిలో చెల్లింపులు జరిగాయని ఐటీ అధికారులు గుర్తించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆ హీరోల బ్యాంక్ ఖాతాలను కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ అనుమానాస్పద చెల్లింపులు నిజమైతే మాత్రం.. ఆ స్టార్ హీరోలను సైతం ముంబైకి పిలిచి విచారణ జరపనున్నారనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోలు ఎవరనేది పక్కన పెడితే.. ఐటీ అధికారులు అనుమానించినట్లుగా చెల్లింపులు జరిగితే మాత్రం.. ఆయా హీరోలు అడ్డంగా బుక్కయినట్లే అని చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఈ ఐటీ దాడుల వెనుక జనసేన వైజాగ్ నేత, కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలు కూడా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ ఆరోపణలు ఏమిటంటే.. ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు వారి ఫారిన్ బిజినెస్‌ల ఆదాయాన్ని.. మైత్రీ మూవీస్ సంస్థ ద్వారా వైట్ మనీగా మార్చుకుంటున్నారట. ఈ సంస్థ వెనుక ఉంది వారిద్దరే అనేలా మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలతో ఈ దాడులు జరిగినట్లుగా టాక్ నడుస్తుంది.

అయితే ఈ దాడులలో విదేశీ పెట్టుబడులు ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించినా.. వాటికి, బాలినేని మరియు తలసానికి ఎటువంటి సంబంధం లేదనేది వారు ధృవీకరించారని తెలుస్తుంది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.