Naga Babu | రామోజీరావుకు నాగబాబు సపోర్ట్.. ఆటాడుకున్న సోషల్ మీడియా

విధాత‌: మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) ఒక్కోసారి కొన్ని విషయాల్లో అత్యుత్సాహంగా ఉంటారు. ఇవేమో కామెంట్స్ పెట్టి వ్యవహారాన్ని, ఆ సందర్భాన్ని హైజాక్ చేస్తుంటారు. తాజాగా మార్గదర్శి చిట్ ఫండ్స్ లో జరిగిన అక్రమాలు, అందులోని నిధులను సదరు మేనేజ్ మెంట్ పక్కదారి పట్టించిన అంశం మీద సీబీసీఐడీ దర్యాప్తు చేస్తూ, రామోజీ రావును సైతం విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశం కోర్టుల పరిధిలో వాటి కనుసన్నల్లో విచారణ జరుగుతున్న తరుణంలో నాగబాబు […]

  • Publish Date - April 5, 2023 / 06:20 PM IST

విధాత‌: మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) ఒక్కోసారి కొన్ని విషయాల్లో అత్యుత్సాహంగా ఉంటారు. ఇవేమో కామెంట్స్ పెట్టి వ్యవహారాన్ని, ఆ సందర్భాన్ని హైజాక్ చేస్తుంటారు. తాజాగా మార్గదర్శి చిట్ ఫండ్స్ లో జరిగిన అక్రమాలు, అందులోని నిధులను సదరు మేనేజ్ మెంట్ పక్కదారి పట్టించిన అంశం మీద సీబీసీఐడీ దర్యాప్తు చేస్తూ, రామోజీ రావును సైతం విచారించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ అంశం కోర్టుల పరిధిలో వాటి కనుసన్నల్లో విచారణ జరుగుతున్న తరుణంలో నాగబాబు (Mega brother Nagababu) రామోజీకి మద్దతుగా పోస్ట్ పెట్టడం పట్ల నెటిజన్లల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పోలీస్ దర్యాప్తులో అది కూడా నిధుల మల్లింపు కేసులో విచారణలో ఉన్నవారికి మద్దతుగా నాగబాబు మాట్లాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇంతకూ నాగబాబు ఏమన్నారంటే ‘లక్షలాది మందికి ఆదర్శనీయుడు, సినీ పత్రిక రంగంగా మకుటాయమానంగా విలసిల్లుతున్నరామోజీ రావును(Ramoji Rao) రాజకీయంగా వేధించడం దారుణం అన్నట్లుగా అయన పోస్ట్ చేసారు. ఇప్పుడంటే రామోజీరావు మీద నాగబాబుకు ఎనలేని ప్రేమ పొంగుకొచ్చింది.

కానీ ఆరోజుల్లో చిరంజీవి ప్రజారాజాన్ని నడపలేని తరుణంలో జెండా పీకేద్దాం అంటూ ఈనాడులో కథనం వచ్చిన విషయాన్నీ నాగబాబు మరిచారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆరోజు ఆలా కథనం ప్రచురితం అయ్యాక ప్రజారాజ్యం కార్యకర్తలు ధర్నాలు చేసి ఈనాడు ప్రతులు దహనం చేసిన సంగతి నాగబాబు మరిచారా అని అంటున్నారు.

“మీ అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చినప్పుడు “జెండా పీకేద్దాం” అని తాటికాయంత అక్షరాలతో హెడ్డింగులు పెట్టి వెక్కిరించాడు ఈ రామోజీ. చిరంజీవి మా కమ్మ రక్తం ఎక్కించుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు అని కండకావరంతో మీ అన్నయ్య ను హేళన చేశాడు.

అప్పుడు మీరు ఖండించిన‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇప్పుడు రామోజీని వెన‌కేసుకు రావ‌డానికి భ‌య‌మా, భ‌క్తా ఏది కార‌ణ‌మో… క్లారిటీ ఇస్తే బాగుంటుంది నాగ‌బాబూ” అంటూ నెటిజ‌న్లు విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎంతటి భక్తి అవసరమా అని ప్రశ్నిస్తున్నా.

Latest News