Nagarjunasagar | బుద్ధవనంలో మయన్మార్ బృందం
Nagarjunasagar విధాత: నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని గురువారం మయన్మార్ దేశపు మత వ్యవహారాల సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారుల బృందం సందర్శించింది. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ న్యూ మిన్టోన్ ఆధ్వర్యంలోని బృందం తెలుగు రాష్ట్రాలలోని బౌద్ధ వారసత్వ సంపద కలిగి ఉన్న ప్రాంతాల సందర్శన, అధ్యయనములో భాగంగా బుద్ధవనం సందర్శించింది. నాగార్జునసాగర్ లోని నాగార్జునకొండ మ్యూజియం సందర్శించి, బుద్ధవనం చేరుకొని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలులు ఘటించారు. బుద్ధ వనములోని మహాస్తుపాన్ని వీక్షించి అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. […]
Nagarjunasagar
విధాత: నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని గురువారం మయన్మార్ దేశపు మత వ్యవహారాల సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారుల బృందం సందర్శించింది. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ న్యూ మిన్టోన్ ఆధ్వర్యంలోని బృందం తెలుగు రాష్ట్రాలలోని బౌద్ధ వారసత్వ సంపద కలిగి ఉన్న ప్రాంతాల సందర్శన, అధ్యయనములో భాగంగా బుద్ధవనం సందర్శించింది.

నాగార్జునసాగర్ లోని నాగార్జునకొండ మ్యూజియం సందర్శించి, బుద్ధవనం చేరుకొని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలులు ఘటించారు. బుద్ధ వనములోని మహాస్తుపాన్ని వీక్షించి అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు.

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్లో బుద్ధ వనంలో భవిష్యత్ తరాలకు బౌద్ధ వారసత్వ సంపదను అందించే విధంగా నిర్మాణం చేపట్టడం పై అభినందించారు. వీరితోపాటు బుద్దవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బుద్ధ వనం డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్రావు, ఏ ఈ నజీష్ తదితరులు ఉన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram