Akhanda 2 | ‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ… డిసెంబర్ 12నే బాలయ్య తాండవం?

Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా రఫ్ అండ్ రా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ పై ప్రేక్షకుల్లో నెలకొన్న ఉత్కంఠ రోజురోజుకూ మరింత పెరుగుతోంది.

  • By: sn |    movies |    Published on : Dec 08, 2025 4:18 PM IST
Akhanda 2 | ‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ… డిసెంబర్ 12నే బాలయ్య తాండవం?

Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా రఫ్ అండ్ రా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ పై ప్రేక్షకుల్లో నెలకొన్న ఉత్కంఠ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా విడుదలకు కొన్ని గంటల ముందు వాయిదా పడిన ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఈ సందిగ్ధానికి చెక్ పెడుతూ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజా ఇంటర్వ్యూలో కీలక సమాచారం వెల్లడించారు. ‘అఖండ 2’ విడుదలను అడ్డుకున్న ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే, డిసెంబర్ 12న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఆయన వ్యాఖ్యలు బాలయ్య అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

పెద్ద సినిమాలకు ఆర్థిక ఇబ్బందులు సాధార‌ణం

తమ్మారెడ్డి మాట్లాడుతూ, భారీ బడ్జెట్‌ చిత్రాలకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ సమస్యలు రావడం కొత్తేమీ కాదని చెప్పారు. గతంలో హరిహర వీరమల్లు కూడా ఇలాంటి ఇబ్బందుల వల్ల ఆలస్యమై, చివరికి విడుదలైన విషయాన్ని గుర్తు చేశారు. ‘అఖండ 2’ విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైందని, అయితే ఇకపైనా ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన తెలిపారు.

డిసెంబర్ 12 విడుదలైతే… బాక్సాఫీస్ దద్దరిల్లేలా!

బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అఘోర పాత్రలో బాలయ్య సృష్టించిన మాస్ హవా ఇప్పటికీ మర్చిపోలేనిది. దీని సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాబట్టి ఒకవేళ డిసెంబర్ 12నే ‘అఖండ 2’ వస్తే, దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రానున్నాయన్నది పరిశ్రమ అంచనా. మొదటి మూడు రోజులు ఏ పెద్ద సినిమాకు కీలకం. ఈ సమయంలోనే అధిక రెవెన్యూ వస్తుందని తమ్మారెడ్డి తెలిపారు.

ఓవర్సీస్‌లోనూ బుకింగ్స్ స్టార్ట్

డిసెంబర్ 12 విడుదల వార్తలు వేగంగా వ్యాపించడంతో పలు ప్రాంతాల్లో ఇప్పటికే థియేటర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆస్ట్రేలియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.

పవర్‌ఫుల్ టెక్నికల్ టీమ్

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్, బాలయ్య ఎనర్జీ, థమన్ బీజీఎమ్ ఈ త్రయం మరోసారి అలరిస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో పెంచుతోంది. మొత్తానికి, తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించిన వివరాలతో ‘అఖండ 2’పై నెలకొన్న అస్పష్టత తొలగిపోయింది. ఇప్పుడు అభిమానులందరి చూపు మేకర్స్ అధికారిక అనౌన్స్‌మెంట్‌పైనే ఉంది.