Hyderabad : హైదరాబాద్ లో ఒకే రోజు రెండు హత్యల కలకలం

హైదరాబాద్ లో ఒకేరోజు రెండు దారుణ హత్యలు కలకలం. మల్కాజిగిరిలో రియల్టర్‌ను కాల్చి, నరికి హత్య. వారసిగూడలో ఇంటర్‌ విద్యార్థిని గొంతుకోసి చంపిన ఘటన సంచలనం.

Hyderabad : హైదరాబాద్ లో ఒకే రోజు రెండు హత్యల కలకలం

విధాత, హైదరాబాద్ : ఓ వైపు ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుండగా..ఇంకోవైపు రాష్ట్ర రాజధానిలో ఇదే రోజు రెండు హత్యలు కలకలం రేపాయి.

తుపాకీలో కాల్చి…కత్తులతో పొడిచి దారుణ హత్య

హైదారాబాద్ మల్కాజిగిరిలోని జవహర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో రియల్ట వెంకటరత్నం (46)ను దుండగులు దారుణంగా హత్య చేశారు. తుపాకీతో కాల్పులు జరిపి..కత్తులతో పొడిచి చంపేశారు. సాకేత్‌ కాలనీ ఫోస్టర్‌ స్కూల్‌ సమీపంలో బైక్‌పై వెళ్తున్న వెంకటరత్నంను దుండగులు వెంబడించారు. కత్తులతో తుపాకీతో కాల్చి, కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరత్నంపై ధూల్‌పేట్‌లో రౌడీషీట్‌ ఉన్నట్లు గుర్తించారు. గతంలో జంట హత్యల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ హత్యపై మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్‌ మాట్లాడుతూ క్లూస్‌ టీమ్‌, ఫొరెన్సిక్‌ బృందాలతో విచారణ చేపట్టామని తెలిపారు. వెంకటరత్నం హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోందన్నారు.

తల్లి ఎదుటే.. ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

పెళ్లికి ప్రేమించిన అమ్మాయి పెద్దలు ఒప్పుకోవడం లేదన్న కోపంతో ఓ యువకుడు ఇంటర్ విద్యార్ధిని(17) దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ వారసిగూడ పోలీస్ స్టేషన పరిధిలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస కు చెందిన బాలిక, ఆమె తల్లిదండ్రులు బౌద్దనగర్ లో నివసిస్తున్నారు. ఆ బాలికకు మేనబావ అయిన ఉమాశంకర్ ఆమెతో పెళ్లి చేయాలని అమె పేరెంట్స్ పై ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ఉమాశంకర్ ప్రవర్తన సరిగా లేదంటూ వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో కోపం పెంచుకున్న ఉమాశంకర్ సోమవారం బాలిక తల్లిదండ్రుల ముందే ఆమెపై దాడి చేశాడు. కత్తితో గొంతు కోసి దారుణంగా చంపాడు. ఈ ఘటనతో బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కళ్ల ముందే కన్నకూతురు చంపబడటంతో కన్నీరు మున్నీరయ్యారు. వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

IndiGo Staff Dance Viral : ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్
Akhanda 2 | ‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ… డిసెంబర్ 12నే బాలయ్య తాండవం?