Nalgonda | హ్యాండ్లూమ్ శాఖ తనిఖీలు.. నకిలీ చేనేత వస్త్రాల గుర్తింపు! నోటీసులు జారీ

Nalgonda విధాత: మర మగ్గాల వస్త్రాలపై అక్రమంగా చేనేత వస్త్రాల ప్రింట్లను వేసి ప్రజలకు విక్రయిస్తున్న నిర్వాకాన్ని హ్యాండ్లూమ్ శాఖ అధికారులు బట్టబయలు చేశారు. నల్గొండ(Nalgonda) పట్టణంలోని స్వర్ణకంచి షాపింగ్ మాల్‌లో హ్యాండ్లూమ్స్ శాఖ అధికారులు అకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ డిజైన్స్ ని డుప్లికేట్ చేసి అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. చేనేత వస్త్ర తయారీకి సంబంధించిన లోగోలు లేకుండా అమ్ముతున్న చీరలను సీజ్ చేసి, షాపింగ్ మాల్ యాజమాన్యనానికి నోటీసు జారీ […]

Nalgonda | హ్యాండ్లూమ్ శాఖ తనిఖీలు.. నకిలీ చేనేత వస్త్రాల గుర్తింపు! నోటీసులు జారీ

Nalgonda

విధాత: మర మగ్గాల వస్త్రాలపై అక్రమంగా చేనేత వస్త్రాల ప్రింట్లను వేసి ప్రజలకు విక్రయిస్తున్న నిర్వాకాన్ని హ్యాండ్లూమ్ శాఖ అధికారులు బట్టబయలు చేశారు. నల్గొండ(Nalgonda) పట్టణంలోని స్వర్ణకంచి షాపింగ్ మాల్‌లో హ్యాండ్లూమ్స్ శాఖ అధికారులు అకస్మిక తనిఖీ నిర్వహించారు.

తనిఖీలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ డిజైన్స్ ని డుప్లికేట్ చేసి అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. చేనేత వస్త్ర తయారీకి సంబంధించిన లోగోలు లేకుండా అమ్ముతున్న చీరలను సీజ్ చేసి, షాపింగ్ మాల్ యాజమాన్యనానికి నోటీసు జారీ చేశారు.

అలాగే పట్టణంలోని పద్మా నగర్ లో పవర్ లూమ్ యూనిట్లో 28 మగ్గాలను తనిఖీ చేసి వాటిపై అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా చేనేత అంచులతో తయారు చేస్తున్న దోతీలను గుర్తించి సీజ్ చేశారు. వాటిని చెన్నై టెస్టింగ్ సెంటర్ కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.