Nalgonda | వర్షాలతో అప్రమత్తం.. వాతావరణ హెచ్చరికలు పాటించాలి: అధికారులకు మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశం
Nalgonda విధాత: వాతావరణ శాఖ హెచ్చరికలను ఎంత మాత్రం బేఖాతారు చేయవద్దని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్ రెడ్డి నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల అలసత్వం వద్దని, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల తో నల్లగొండ జిల్లాలో ఉత్పన్నమవుతున్న పరిస్థితులపై గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ […]
Nalgonda
విధాత: వాతావరణ శాఖ హెచ్చరికలను ఎంత మాత్రం బేఖాతారు చేయవద్దని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్ రెడ్డి నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల అలసత్వం వద్దని, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

భారీ వర్షాల తో నల్లగొండ జిల్లాలో ఉత్పన్నమవుతున్న పరిస్థితులపై గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram