Minister Jagdish Reddy | రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్ది మండిపాటు

Minister Jagdish Reddy కాంగ్రెస్ పార్టీ వస్తే కోతలు.. వాతలే విధాతః వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు అనవసరమంటు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరోసారి మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. హుజూర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతు ఏఐసీసీ నిర్ణయాన్నేబుడ్డర్ ఖాన్ లు, పేపర్ పులులు బహిర్గతం చేశారంటు రేవంత్‌నుద్దేశించి విమర్శించారు. ఎనిమిది గంటల విద్యుత్తునే కాంగ్రెస్ రహస్య ఎజెండా అన్నారు. 24 గంటల విద్యుత్తు విధానం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదన్నారు. అదే నిజమయితే కాంగ్రెస్ […]

  • By: Somu    latest    Jul 20, 2023 12:30 AM IST
Minister Jagdish Reddy | రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్ది మండిపాటు

Minister Jagdish Reddy

  • కాంగ్రెస్ పార్టీ వస్తే కోతలు.. వాతలే

విధాతః వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు అనవసరమంటు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరోసారి మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. హుజూర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతు ఏఐసీసీ నిర్ణయాన్నేబుడ్డర్ ఖాన్ లు, పేపర్ పులులు బహిర్గతం చేశారంటు రేవంత్‌నుద్దేశించి విమర్శించారు. ఎనిమిది గంటల విద్యుత్తునే కాంగ్రెస్ రహస్య ఎజెండా అన్నారు.

24 గంటల విద్యుత్తు విధానం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదన్నారు. అదే నిజమయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఛత్తీస్ ఘడ్ లో వ్యవసాయానికి 7 గంటలే సరఫరా అవుతుందన్నారు. బుడ్డర్ ఖాన్ నోటి వెంట మూడు గంటల విద్యుత్తు మాత్రమే వచ్చిందన్నఅంశాన్ని రైతులు గమనించాలన్నారు. గుజరాత్ లో ఇచ్చేది ఆరు గంటలేనని, ఉత్తర ప్రదేశ్ లో కరెంట్ లేని గ్రామాలు కోకొల్లలు అన్నారు.

2014 లో ప్రజలు గులాబీ జెండాను ఎత్తుకోక పోతే ఇక్కడ అదే పరిస్థితి ఉండేదన్నారు. పేపర్ పులి రేవంత్ నోటివెంట సంక్షేమ పథకాలు ఎత్తివేత ప్రకటన కూడా రావచ్చని, ఫించన్ 200 కు కుదింపు, కల్యాణలక్ష్మి/షాది ముబారక్ లకు మంగళం, రైతుబంధు, రైతుబీమా ఎత్తివేతకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చన్నారు. అన్నం పెట్టె రైతుకు సున్నం పెట్టె కుట్రలు రేవంత్ చేస్తున్నారన ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగింపుకు సీఎం కేసీఆర్ నాయకత్వమే శరణ్యమన్నారు.