Nalgonda | సీఎల్పీ నేత భట్టితో రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి భేటీ

Nalgonda పాదయాత్ర ఏర్పాట్లు, కార్నర్ మీటింగ్ పై సమీక్ష రేపు సూర్యాపేట నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించ‌నున్న పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌ విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రం జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన పాదయాత్ర శిబిరం వద్దకి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వచ్చి భట్టిని కలిశారు. బుధవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా ఏలూరి గూడెంలో భట్టి విక్రమార్క పాదయాత్ర అడుగుపెట్టనుంది. ఈనెల […]

Nalgonda | సీఎల్పీ నేత భట్టితో రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి భేటీ

Nalgonda

  • పాదయాత్ర ఏర్పాట్లు, కార్నర్ మీటింగ్ పై సమీక్ష
  • రేపు సూర్యాపేట నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించ‌నున్న పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌

విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రం జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన పాదయాత్ర శిబిరం వద్దకి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వచ్చి భట్టిని కలిశారు.

బుధవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా ఏలూరి గూడెంలో భట్టి విక్రమార్క పాదయాత్ర అడుగుపెట్టనుంది. ఈనెల 21, 22, 23 తేదీల్లో సూర్యాపేట జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగనుంది. 22న సూర్యాపేట పట్టణంలో కార్నర్ మీటింగ్ ఉంటుంది.

మూడు రోజులపాటు సూర్యాపేటలో జరిగే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఏర్పాట్లు, కార్నర్ మీటింగ్ విజయవంతం కోసం వారిద్దరి మధ్యన చర్చ జరిగింది. పాదయాత్రను విజయవంతం చేయడానికి క్యాడర్ ను ఇప్పటికే సన్నాహాకం చేశామని అక్కడ చేస్తున్న ఏర్పాట్ల గురించి దామోదర్ రెడ్డి సీఎల్పీ నేత భట్టికి వివరించారు. సూర్యాపేట నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతం కోసం దామోదర్ రెడ్డి చేస్తున్న కృషికి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.