Nara Devansh | నారా దేవాన్ష్ పుట్టిన రోజు.. టీటీడీకి రూ. 33 లక్షల విరాళం
విధాత: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మనువడు నారా దేవాన్ష్ (Nara Devansh) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాని(TTD)కి నారా కుటుంబం భారీ విరాళం అందజేసింది. దేవాన్ష్ బర్త్‌డేను పురస్కరించుకొని.. తిరుమల కొండపై ఒకరోజు అన్నప్రసాద వితరణకు రూ. 33 లక్షల విరాళాన్ని లోకేశ్, బ్రాహ్మణి దంపతులు టీటీడీ అధికారులకు అందజేశారు. తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కోసం ఈ విరాళాన్ని కేటాయించారు. అయితే ప్రతి […]

విధాత: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మనువడు నారా దేవాన్ష్ (Nara Devansh) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాని(TTD)కి నారా కుటుంబం భారీ విరాళం అందజేసింది. దేవాన్ష్ బర్త్‌డేను పురస్కరించుకొని.. తిరుమల కొండపై ఒకరోజు అన్నప్రసాద వితరణకు రూ. 33 లక్షల విరాళాన్ని లోకేశ్, బ్రాహ్మణి దంపతులు టీటీడీ అధికారులకు అందజేశారు. తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కోసం ఈ విరాళాన్ని కేటాయించారు.
అయితే ప్రతి ఏడాది దేవాన్ష్ బర్త్ డేను పురస్కరించుకొని టీటీడీకి భారీ విరాళం అందిస్తుంది నారా కుటుంబం. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీని కొనసాగించారు. ఈ సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్య ప్రసాద వితరణ కేంద్రం భవనంలో.. టుడే డోనర్ మాస్టర్ నారా దేవాన్ష్ అనే పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అక్కడున్న డిస్ ప్లే బోర్డులో పేర్కొన్నారు.