MSP Price Hike | వరికి కనీస మద్దతు ధర రూ. 2183.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
గతం కంటే రూ.143 పెంపు విధాత : ఖరీఫ్ సీజన్ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2023-24 వ్యవసాయ సంవత్సరానికి గాను ఖరీఫ్ పంటలకు మద్ధతు ధర (MSP Price Hike)లను ఖరారు చేసింది. వ్యవసాయ ధరల కమిషన్ సూచనల మేరకు ఎప్పటికప్పుడు మద్దతు ధరలను పెంచుతున్నట్టు కమిటీ సమావేశం అనంతరం కేంద్ర ఆహార శాఖ మంత్రి పియూష్ గోయెల్ వెల్లడించారు. గత […]
- గతం కంటే రూ.143 పెంపు
విధాత : ఖరీఫ్ సీజన్ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2023-24 వ్యవసాయ సంవత్సరానికి గాను ఖరీఫ్ పంటలకు మద్ధతు ధర (MSP Price Hike)లను ఖరారు చేసింది.
వ్యవసాయ ధరల కమిషన్ సూచనల మేరకు ఎప్పటికప్పుడు మద్దతు ధరలను పెంచుతున్నట్టు కమిటీ సమావేశం అనంతరం కేంద్ర ఆహార శాఖ మంత్రి పియూష్ గోయెల్ వెల్లడించారు. గత ఏడాదితో పోల్చినప్పుడు ఈ సంవత్సరం మద్దతు ధరలు బాగా పెరిగాయని ఆయన అన్నారు.
సాధారణ రకం వరి మద్దతు ధరను 143 రూపాయలు పెంచారు. 2023-24 సంవత్సరానికిగాను క్వింటాలు వరి ధర 2183కు పెంచారు. ఏ గ్రేడు వరి మద్దతు ధరను 163 రూపాయలు పెంచారు.
క్వింటాలు వరి ధర 2203 కు పెంచారు. పెసర పప్పు మద్దతు ధరను గరిష్ఠంగా పెంచడంతో ధర 8858 రూపాయలకు చేరింది. వేరుశనగల ధరను పదిశాతం పెంచుతూ క్వింటాకు 6,357 చేశారు
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram