CP Ranganath | సీపీ ఫ్లెక్సీకి.. రైతు దంపతుల పాలాభిషేకం
అండగా నిలిచినందుకు కృతజ్ఞత విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తమకు న్యాయం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ (CP Ranganath) ఫ్లెక్సీకి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రైతు నాడెం వీరస్వామి, రాజ్యలక్ష్మీ దంపతులు శుక్రవారం క్షీరాభి షేకం చేశారు. ఈ సందర్భంగా రైతు దంపతులు మాట్లాడుతూ.. తమకు నర్సంపేట శివారులో రెండెకరాల భూమి ఉండగా, అందులో నుంచి ఇరవై గుంటల భూమిని ఏనుగుల తండాకు చెందిన ఎస్‌బీఐ ఉద్యోగి బానోతు అనీల్ నాయక్, సునీల్ […]

- అండగా నిలిచినందుకు కృతజ్ఞత
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తమకు న్యాయం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ (CP Ranganath) ఫ్లెక్సీకి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రైతు నాడెం వీరస్వామి, రాజ్యలక్ష్మీ దంపతులు శుక్రవారం క్షీరాభి
షేకం చేశారు. ఈ సందర్భంగా రైతు దంపతులు మాట్లాడుతూ.. తమకు నర్సంపేట శివారులో రెండెకరాల భూమి ఉండగా, అందులో నుంచి ఇరవై గుంటల భూమిని ఏనుగుల తండాకు చెందిన ఎస్‌బీఐ ఉద్యోగి బానోతు అనీల్ నాయక్, సునీల్ నాయక్‌కు 2018లో అమ్మినట్లు తెలిపారు.
కాగా.. గత కొద్ది కాలం నుంచి మరో పది గుంటల భూమిని అమ్మాలని వారు తమను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. కొంత మందితో కలిసి బెదిరించి హద్దు రాళ్లు తొలగించారని చెప్పారు.
కులం పేరుతో దూషించామని మాపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. తమకు జరిగిన అన్యాయం గురించి సీపీకి చెప్పామన్నారు. సీపీ విచారించి తమకు న్యాయం చేశారని రైతు దంపతులు తెలిపారు. డీసీపీ కరుణాకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.