నయనతార vs మాళవిక మోహనన్: ఆరని మంటలు.. తగ్గని ట్రోలింగ్‌!

<p>విధాత‌, సినిమా: మాళవిక మోహనన్ మలయాళ నటి. ఈమె తెలుగులో తొలిసారిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా డీలక్స్ అనే హర్రర్ థ్రిల్ల‌ర్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. తెలుగులో ఈమెకు ఇదే డైరెక్ట్ తెరంగేట్రం మూవీ కాగా.. ‘మాస్టర్’ సినిమాతో కాస్త తెలుగు ప్రేక్షకులకి అయితే ఈ భామ బాగానే పరిచయమైంది. ఈమె ఇటీవల మలయాళ నటుడు మాథ్యూ థామస్ జోడీగా నటించిన ‘క్రిస్టీ’ సినిమా ట్రైలర్ లాంచ్ […]</p>

విధాత‌, సినిమా: మాళవిక మోహనన్ మలయాళ నటి. ఈమె తెలుగులో తొలిసారిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా డీలక్స్ అనే హర్రర్ థ్రిల్ల‌ర్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. తెలుగులో ఈమెకు ఇదే డైరెక్ట్ తెరంగేట్రం మూవీ కాగా.. ‘మాస్టర్’ సినిమాతో కాస్త తెలుగు ప్రేక్షకులకి అయితే ఈ భామ బాగానే పరిచయమైంది.

ఈమె ఇటీవల మలయాళ నటుడు మాథ్యూ థామస్ జోడీగా నటించిన ‘క్రిస్టీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించింది. ఆ సమయంలో ఆమెను నయనతార గురించి స్పందించమని మీడియా కోరింది. అప్పుడు ఆమె నాకు లేడీ సూపర్ స్టార్ అనడం నచ్చదు అని సమాధానం ఇచ్చింది. దాంతో ఈ మాట బాగా వైరల్ అయింది.

నిజానికి మాళవిక ఏ ఉద్దేశంతో ఆ మాటలు చెప్పిందంటే నాకు సూపర్ స్టార్ అనే పదమే నచ్చదు. హీరోలను సూపర్ స్టార్ అంటారు. లేడీ అయినా కూడా సూప‌ర్ స్టార్ అనే పిల‌వాలి. అంతేగానీ లేడీ సూప‌ర్ స్టార్ అన‌డం క‌రెక్ట్ కాదు. లేడీ అనే ప‌దం తీసేసి హీరోల‌నైనా, హీరోయిన్ల‌నైనా సూప‌ర్ స్టార్ అనే పిల‌వాలి.

అంతేగానీ హీరోయిన్ల‌ను లేడీ సూపర్ స్టార్ అన‌డం నాకు న‌చ్చ‌దు అన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్య‌లు చేసింది. కానీ ఈ విష‌యంలో త‌మిళ‌ తంబీలు అందునా న‌య‌న‌తార వీరాభిమానుల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి. దానితో మొద‌లు మాళ‌విక‌ను వీరు య‌మా ట్రోలింగ్ చేస్తూ వ‌స్తున్నారు. ఇది చినికి చినికి గాలి వాన‌లా మారుతోంది.

బాలీవుడ్‌లో అలియా భట్ కత్రినా కైఫ్ వంటి వాళ్ల గురించి చెప్పేటప్పుడు లేడీ అనేది వాడరని మాళవిక ఉద్దేశం. కానీ ఆమె ఉద్దేశం తెలియక చాలామంది ఆమెపై ట్రోలింగ్ మొదలెట్టారు. మాళవిక మోహనన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నయనతారను లేడీ సూపర్ స్టార్ అనొద్దని కేవలం సూపర్ స్టార్ అనాలని ఆమె ఉద్దేశం. ఫిమేల్ యాక్టర్స్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే పదం గురించి మాత్రమే కామెంట్ చేశానని మాళ‌విక వివ‌ర‌ణ ఇస్తున్నా న‌య‌నాభిమానులు మాత్రం మాళ‌వికపై ప‌గ తీర్చుకుంటున్నారు.

త‌మిళ‌ తంబీలే అంత‌.. హీరోల‌నే కాదు.. హీరోయిన్ల‌కు సైతం అక్క‌డ వీరాభిమానులు ఉంటారు. గ‌తంలో జ‌య‌ల‌లిత‌, ఖుష్బూ, న‌మిత వంటి వారికి వారు ఏకంగా గుళ్లు క‌ట్టి పూజ‌లు చేశారు. ప్ర‌స్తుతం అక్క‌డ న‌య‌న‌తార హ‌వా న‌డుస్తోంది.

ఇక తనపై వస్తున్న ట్రోలింగ్‌కు మాళ‌విక స్పందిస్తూ.. నేను లేడీ అనే ప‌దాన్ని త‌ప్పు ప‌ట్టాను. అంతే త‌ప్ప న‌య‌న‌తార‌ని ఏమీ అన‌లేదు. నయనతార అంటే నాకు నిజంగా ఎంతో గౌరవం అని తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో ఆమె తన కంటే సీనియర్ అని హీరోయిన్‌గా ఆమె జర్నీ అద్భుతమని చెప్పుకొచ్చింది. మ‌రి మాళ‌విక వివ‌ర‌ణ ఇచ్చినా మ‌న ట్రోలింగ్ రాయుళ్లు కాస్తైనా శాంతిస్తారా? లేదా? అనేది వేచి చూడాల్సి వుంది.

Latest News