Nayanthara | షారుఖ్‌ ‘జవాన్‌’లో నయన్‌ బికినీ షో..! పెళ్లయ్యాక ఇదేం పనంటూ పెదవి విరుపులు..!

Nayanthara | తనదైన నటనతో దక్షిణాదిలో లేడి సూపర్‌స్టార్‌గా ఎదిగింది నయనతార. దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగు, తమిళం, మలయాళ చిత్ర పరిశ్రమల్లో ఇప్పటికీ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నది. ఇటీవల వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ వస్తున్నది. అదే సమయంలో టాప్‌ హీరోలతో జతకడుతున్నది. గతేడాది దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకున్న చేసుకుంది. పెళ్లయిన కొద్దినెలల్లోనే ఇద్దరు పిల్లలకు తల్లయినట్లుగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం నయన్‌కు సంబంధించిన బిగ్‌ న్యూస్‌ […]

Nayanthara | షారుఖ్‌ ‘జవాన్‌’లో నయన్‌ బికినీ షో..! పెళ్లయ్యాక ఇదేం పనంటూ పెదవి విరుపులు..!

Nayanthara | తనదైన నటనతో దక్షిణాదిలో లేడి సూపర్‌స్టార్‌గా ఎదిగింది నయనతార. దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగు, తమిళం, మలయాళ చిత్ర పరిశ్రమల్లో ఇప్పటికీ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నది. ఇటీవల వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ వస్తున్నది.

అదే సమయంలో టాప్‌ హీరోలతో జతకడుతున్నది. గతేడాది దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకున్న చేసుకుంది. పెళ్లయిన కొద్దినెలల్లోనే ఇద్దరు పిల్లలకు తల్లయినట్లుగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసింది.

ప్రస్తుతం నయన్‌కు సంబంధించిన బిగ్‌ న్యూస్‌ ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో ‘జవాన్’ చిత్రంలో జతకడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో నయన్‌కు ఇదే తొలి చిత్రం. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో నయన్‌ బికినీలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఓ సన్నివేశంలో బికినీలో అందాలు ఆరబోతకు అంగీకరించిందని, ఈ బోల్డ్‌ సీన్‌లో నటించేందుకు భారీగానే డిమాండ్‌ చేసిందని టాక్‌. జవాన్ చిత్రానికి రూ.10కోట్ల రెమ్యునరేషన్‌ అందుకోనున్నట్లు సమాచారం.

నయన్‌ బికినీ వార్తల్లో వాస్తవమెంతో తెలియదు కానీ.. ఈ విషయం తెలిసిన అభిమానులు మాత్రం నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. డబ్బుల కోసం ఇంత కక్కుర్తి అవసరమా? అంటూ విమర్శిస్తున్నారు.

పెళ్లయిన తర్వాత బికినీలో అందాల ప్రదర్శన అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఇందులో రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. నయనతార కెరీర్ తొలినాళ్లలో అందాల ఆరబోతతో పాటు లిప్‌లాక్స్‌, బెడ్‌రూమ్స్‌ సీన్స్‌లో నటించింది.

అజిత్ హీరోగా తెరకెక్కిన బిల్లా మూవీలో ఆమె సెమీ బికినీలో కనిపించిన నయన్‌.. చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో టూ పీస్‌ బికినీలో కనిపించనుందంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.