Neeraj Chopra | ఒలింపిక్స్‌కు నీరజ్ చోప్రా అర్హ‌త‌

బుడ‌ఫెస్ట్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఈటెను 88.77 మీటర్లు విసిరి ఆగ్ర‌స్థానం Neeraj Chopra | విధాత‌: టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మ‌రోమారు స‌త్తాచాటాడు. అమెరికాలో జ‌రుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023 జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్‌లో 88.77 మీటర్ల దూరం ఈటెను విసిరి టాప్‌లో నిలిచాడు. అలాగే 2024 పారిస్ ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించాడు. ఈ సీజ‌న్‌లో ఇది అత‌డిబెస్ట్ త్రోగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మార్క్ 85.50 మీట‌ర్లు కాగా, […]

  • By: Somu    latest    Aug 25, 2023 12:50 AM IST
Neeraj Chopra | ఒలింపిక్స్‌కు నీరజ్ చోప్రా అర్హ‌త‌
  • బుడ‌ఫెస్ట్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో
  • ఈటెను 88.77 మీటర్లు విసిరి ఆగ్ర‌స్థానం

Neeraj Chopra | విధాత‌: టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మ‌రోమారు స‌త్తాచాటాడు. అమెరికాలో జ‌రుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023 జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్‌లో 88.77 మీటర్ల దూరం ఈటెను విసిరి టాప్‌లో నిలిచాడు. అలాగే 2024 పారిస్ ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించాడు. ఈ సీజ‌న్‌లో ఇది అత‌డిబెస్ట్ త్రోగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మార్క్ 85.50 మీట‌ర్లు కాగా, 88.77 విసిరి బెర్త్ ఖాయం చేసుకున్నాడు.

అమెరికా బుడ‌ఫెస్ట్‌లో జరుగుతున్న ప్ర‌పంచ జావెలిన్ త్రో పోటీల్లో భార‌తీయుడు డీపీ మను కూడా ఫైనల్ పోటీలో నిలిచాడు. అతను 78.10 మీటర్ల త్రోతో పోటిని ప్రారంభించాడు. త‌ర్వాత 81.31 మీటర్ల అద్భుతమైన త్రోతో గ్రూప్ A అర్హత జాబితాలో మూడవ స్థానానికి చేరుకున్నాడు. కానీ, నీరజ్ ఒకే అటెంప్ట్‌లో 88.77 మీటర్లు ఈటెను విసిరి జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. వ‌చ్చే ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన నీర‌జ్ చోప్రాకు సోష‌ల్‌మీడియాలో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.