Olympics | ఒలింపిక్ చాంపియన్‌ను కంగుతినిపించిన వినేశ్ ఫొగట్.. పతకానికి అడుగు దూరంలో!
భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ తన తొలి ఒలింపిక్ పతకానికి ఒక్క విజయం దూరంలో నిలిచింది. ఒలింపిక్ చాంపియన్ యూయి సుసాకీని ప్రీక్వార్టర్ ఫైనల్‌లో కంగు తినిపించిన వినేశ్.. 50 కిలోల రెజ్లింగ్ క్వార్టర్‌ఫైనల్‌లో ఉక్రెయిన్‌కు

పారిస్ : భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ తన తొలి ఒలింపిక్ పతకానికి ఒక్క విజయం దూరంలో నిలిచింది. ఒలింపిక్ చాంపియన్ యూయి సుసాకీని ప్రీక్వార్టర్ ఫైనల్‌లో కంగు తినిపించిన వినేశ్.. 50 కిలోల రెజ్లింగ్ క్వార్టర్‌ఫైనల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన 2018 వరల్డ్ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత ఒక్సానా లివాచ్‌ను మట్టికరిపించి సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో విజయం సాధిస్తే తొలిసారి వినేశ్ ఫొగట్‌కు తొలి ఒలింపిక్ పతకం దక్కుతుంది. ఇప్పటికే భారీ ఆశాకిరణం నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే ఈటెను 89.34 మీటర్ల దూరం విసిరి.. ఫైనల్ బెర్త్‌ను అతడు ఖాయం చేసుకున్నాడు. దేశానికి ఒలింపిక్ పతకాన్ని అందించేందుకు వినేశ్ మూడో ప్రయత్నం ఇది. సెమీస్‌లో విజయం సాధిస్తే ఆమెకు రజత పతకం ఖాయమైనట్టే. 2016 రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం ప్రయత్నించిన ఫొగట్.. ప్రాణాంతక గాయంతో టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.