Olympics | ఒలంపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం

ఒలంపిక్స్‌లో భారత్‌ రెండో పతకం సాధించింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించి తొలి పతకం సాధించిన మనుభాకర్ మంగళవారం 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌సింగ్ తో కలిసి మరో కాంస్యం సాధించింది.

Olympics | ఒలంపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం

మరో కాంస్యం సాధించిన మనోభాకర్‌, సరబ్‌జోత్‌సింగ్ జోడి
రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మనుభాకర్‌

విధాత, హైదరాబాద్ : ఒలంపిక్స్‌లో భారత్‌ రెండో పతకం సాధించింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించి తొలి పతకం సాధించిన మనుభాకర్ మంగళవారం 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌సింగ్ తో కలిసి మరో కాంస్యం సాధించింది. దీంతో ఈ ఒలంపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య రెండుకు చేరింది. ఒకే ఒలంపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మనుభాకర్ కొత్త చరిత్ర సృష్టించింది.