NEET EXAM | నీట్ ప‌రీక్ష‌.. అమ్మాయిల లోదుస్తులు చెకింగ్

NEET EXAM | నీట్ ప‌రీక్ష రాయ‌డానికి వ‌చ్చిన అమ్మాయిలను డ్రెసింగ్ మార్చుకోవాల‌ని, లేదా పైన ఉన్న దుస్తుల‌ను లోప‌ల ధ‌రించి రావాల‌ని చెప్పిన ఘ‌ట‌న‌లు రెండు వెలుగు చూశాయి. ఒక ఘ‌ట‌న మహారాష్ట్రలోనూ, మ‌రో ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్‌లోనూ చోటు చేసుకుంది. వీటిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు ఆయా అభ్య‌ర్థుల త‌ల్లిదండ్రులు వెల్ల‌డించారు. చాలా చోట్ల అభ్య‌ర్థుల దుస్తులు నిబంధ‌న‌లకు అనుగుణంగా లేవ‌ని ప‌రీక్ష కేంద్రాల ఉన్న సిబ్బంది చెప్ప‌డంతో.. కొంత మంది ద‌గ్గ‌ర్లో ఉన్న […]

  • By: krs    latest    May 09, 2023 8:58 AM IST
NEET EXAM | నీట్ ప‌రీక్ష‌.. అమ్మాయిల లోదుస్తులు చెకింగ్

NEET EXAM |

నీట్ ప‌రీక్ష రాయ‌డానికి వ‌చ్చిన అమ్మాయిలను డ్రెసింగ్ మార్చుకోవాల‌ని, లేదా పైన ఉన్న దుస్తుల‌ను
లోప‌ల ధ‌రించి రావాల‌ని చెప్పిన ఘ‌ట‌న‌లు రెండు వెలుగు చూశాయి. ఒక ఘ‌ట‌న మహారాష్ట్రలోనూ, మ‌రో ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్‌లోనూ చోటు చేసుకుంది. వీటిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు ఆయా అభ్య‌ర్థుల త‌ల్లిదండ్రులు వెల్ల‌డించారు.

చాలా చోట్ల అభ్య‌ర్థుల దుస్తులు నిబంధ‌న‌లకు అనుగుణంగా లేవ‌ని ప‌రీక్ష కేంద్రాల ఉన్న సిబ్బంది చెప్ప‌డంతో.. కొంత మంది ద‌గ్గ‌ర్లో ఉన్న బ‌ట్ట‌ల దుకాణాల‌కు ప‌రిగెత్తారు. మ‌రి కొంత మంది త‌మ త‌ల్లిదండ్రుల దుస్తుల‌ను మార్చుకున్నారు.

త‌మ‌ బ్రా హుక్‌ల‌ను చెక్ చేశార‌ని, లో దుస్తుల‌ను చూపించాల‌ని అడిగిన‌ట్లు కొంతమంది సోష‌ల్ మీడియా క‌థ‌నాల్లో చెప్పుకొచ్చారు. దీనిపై కొంత మంది అధికారులు స్పందించారు. జేబులు ఉన్న‌ ప్యాంట్లు వేసుకు రావ‌ద్ద‌ని స్ప‌ష్టంగా చెప్పినా.. కొన్ని చోట్ల ఆరు, ఐదు జేబులు ఉన్న ప్యాంట్లు వేసుకుని వ‌చ్చార‌న్నారు. తామే క‌త్తెర‌తో వాటిని క‌ట్ చేసి కొంత‌మందిని ప‌రీక్ష‌కు అనుమ‌తించిన‌ట్లు చెప్పారు.