New Delhi | 26 విపక్షాలపై ఢిల్లీలో కేసు నమోదు
New Delhi ‘ఇండియా’ పదం దుర్వినియోగం చేశారని ఆరోపణ న్యూఢిల్లీ: తమ కూటమికి ఐఎన్‌డీఐఏ అని పేరు పెట్టుకోవడం ద్వారా ఆ పదాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ 26 ప్రతిపక్ష పార్టీలపై ఢిల్లీలోని బరఖంబ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రతిపక్షాలు ఇండియా పేరు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డాక్టర్ అవినాశ్ గుప్తా అనే వ్యక్తి ఈ కేసు నమోదు చేశారు. దీనిని ఎన్నికల్లో వాడటం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున సత్వరమే తగిన […]

New Delhi
- ‘ఇండియా’ పదం దుర్వినియోగం చేశారని ఆరోపణ
న్యూఢిల్లీ: తమ కూటమికి ఐఎన్‌డీఐఏ అని పేరు పెట్టుకోవడం ద్వారా ఆ పదాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ 26 ప్రతిపక్ష పార్టీలపై ఢిల్లీలోని బరఖంబ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రతిపక్షాలు ఇండియా పేరు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డాక్టర్ అవినాశ్ గుప్తా అనే వ్యక్తి ఈ కేసు నమోదు చేశారు.
దీనిని ఎన్నికల్లో వాడటం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. భారతదేశం పేరును 26 పార్టీలు దుర్వినియోగం చేశాయని ఆయన ఆరోపింపించారు.