Nizamabad | రోడ్లు భవనాల శాఖలో రూ.5వేల కోట్ల అవినీతి: ఎంపీ అరవింద్
Nizamabad ఎమ్మెల్సీ కవితకు వాటా తీవ్ర ఆరోపణలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ విధాత ప్రతినిధి నిజామాబాద్: రోడ్లు భవనాల శాఖలో రూ.5221 కోట్ల అవినీతి జరిగిందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. నాలుగేళ్లలో డబుల్ బిల్లింగ్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులను నొక్కేశారన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని వేల్సూర్ హైలెవల్ బ్రిడ్జి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఒక్క నిజామాబాద్ జిల్లాలోని 318 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. 51 పనుల్లో 33 పనులు తన సొంత సెగ్మెంట్ […]

Nizamabad
- ఎమ్మెల్సీ కవితకు వాటా
- తీవ్ర ఆరోపణలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్
విధాత ప్రతినిధి నిజామాబాద్: రోడ్లు భవనాల శాఖలో రూ.5221 కోట్ల అవినీతి జరిగిందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. నాలుగేళ్లలో డబుల్ బిల్లింగ్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులను నొక్కేశారన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని వేల్సూర్ హైలెవల్ బ్రిడ్జి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఒక్క నిజామాబాద్ జిల్లాలోని 318 కోట్ల స్కామ్ జరిగిందన్నారు.
51 పనుల్లో 33 పనులు తన సొంత సెగ్మెంట్ బాల్కొండ లోనే చేపట్టారని ఆరోపించారు. ఒకే పనికి రెండు రకాలనిధులు వినియోగించారన్నారు. తప్పుడు నివేదికలు సమర్పించారన్నారు. జరిగిన పనుల్లోనూ 25 శాతం కమిషన్ లు తీసుకున్నారన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కవిత కాళ్ల వద్ద మంత్రి ప్రశాంత్‌రెడ్డి దార పోస్తున్నారని విమర్శించారు.
బాల్కోండలో కట్టిన ప్రతి బ్రడ్జిపై కవితకు కమిషన్ వెళుతుందన్నారు. తెలంగాణకు ప్రధాని మోడీ ఇచ్చిన నిధులను కేసీఆర్ కుటుంబానికి మల్లిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అవినీతి పై విచారణ జరిపించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ కు ఫిర్యాదు చేశానన్నారు.