Dress Code । లుంగీలు, నైటీలు వేసుకుని తిరుగుతామంటే.. అక్కడ కుదరదు!
గ్రేటర్ నోయిడా: ఆఫీసుకు ఫలానా తరహాలో డ్రెస్ (Dress Code) వేసుకుని రావాలి.. అని డ్రెస్ కోడ్ ఉంటుంది కానీ.. ఒక అపార్ట్‌మెంట్ విచిత్రంగా డ్రెస్ కోడ్‌ను విధించింది. అదేమంటే లుంగీలు, నైటీలు ధరించి కామన్ ఏరియాల్లో తిరగడం నిషిద్ధం. ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. గ్రేటర్ నోయిడాలోని హిమసాగర్ అపార్ట్‌మెంట్ ఈ విచిత్ర నిబంధనను తీసుకొచ్చింది. ‘మీరు వ్యవహరించే తీరుపైనా శ్రద్ధ పెట్టండి. దాని వల్ల మీకు ఎవరితోనూ సమస్యలు రావు. పైగా.. మీ పిల్లలు కూడా […]
గ్రేటర్ నోయిడా: ఆఫీసుకు ఫలానా తరహాలో డ్రెస్ (Dress Code) వేసుకుని రావాలి.. అని డ్రెస్ కోడ్ ఉంటుంది కానీ.. ఒక అపార్ట్‌మెంట్ విచిత్రంగా డ్రెస్ కోడ్‌ను విధించింది. అదేమంటే లుంగీలు, నైటీలు ధరించి కామన్ ఏరియాల్లో తిరగడం నిషిద్ధం. ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు.
గ్రేటర్ నోయిడాలోని హిమసాగర్ అపార్ట్‌మెంట్ ఈ విచిత్ర నిబంధనను తీసుకొచ్చింది. ‘మీరు వ్యవహరించే తీరుపైనా శ్రద్ధ పెట్టండి. దాని వల్ల మీకు ఎవరితోనూ సమస్యలు రావు. పైగా.. మీ పిల్లలు కూడా మీ నుంచి నేర్చుకుంటారు.
కనుక.. ఇందు మూలముగా తెలియజేయునది ఏమనగా.. కామన్ ఏరియాల్లో లుంగీలు, నైటీలు ధరించి తిరగడం నిషిద్ధం’ అని సర్క్యులర్ జారీ చేసింది. హాయిగా లుంగీలు, నైటీలు వేసుకుని తిరిగితే ఉండే హాయి మీకేం తెలుసు? అంటూ కొందరు వ్యతిరేకించారట.
అయితే.. అపార్ట్‌మెంట్‌లో ఉండే ఇతరులు తాము నైటీలు, లుంగీలతో తిరిగేవారితో ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదులు చేశారట. వాటిని చూపించిన అసోసియేషన్ బాధ్యులు.. ఈ రూల్ తెచ్చామని చెప్పారట
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram