Vizianagaram | ఎమ్మెల్యే వద్దు జగనన్న ముద్దు.. శృంగవరపుకోట ఎమ్మెల్యేకు నిరసన సెగ‌

విధాత‌: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం (Vizianagaram) జిల్లా శృంగవరపుకోట వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు ప్రజల్లో అసమ్మతి రాజుకుంటోంది. సీఎం జగన్ అయితే ముద్దు కానీ నువ్వైతే వద్దు అంటూ జనం నేరుగా పోస్టర్స్ వేస్తున్నారు. వాస్తవానికి ఆయన పొరుగునున్న గజపతినగరం నియోజకవర్గానికి చెందినవారు. 2009 లో పీఆర్పీలో పోటీచేసి ఓడిపోయారు .. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా మళ్ళీ అది ఫలితం. దీంతో అయన 2019లో శృంగవరపుకోటకు వలస వెళ్లి పోటీ […]

  • By: Somu    latest    Jul 01, 2023 12:20 AM IST
Vizianagaram | ఎమ్మెల్యే వద్దు జగనన్న ముద్దు.. శృంగవరపుకోట ఎమ్మెల్యేకు నిరసన సెగ‌

విధాత‌: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం (Vizianagaram) జిల్లా శృంగవరపుకోట వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు ప్రజల్లో అసమ్మతి రాజుకుంటోంది. సీఎం జగన్ అయితే ముద్దు కానీ నువ్వైతే వద్దు అంటూ జనం నేరుగా పోస్టర్స్ వేస్తున్నారు. వాస్తవానికి ఆయన పొరుగునున్న గజపతినగరం నియోజకవర్గానికి చెందినవారు. 2009 లో పీఆర్పీలో పోటీచేసి ఓడిపోయారు .. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా మళ్ళీ అది ఫలితం.

దీంతో అయన 2019లో శృంగవరపుకోటకు వలస వెళ్లి పోటీ చేసి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని ఓడించారు. అయితే ఆయన ఎన్నారై కావడం సగం రోజులు అమెరికాలో ఉండడం .. అప్పుడప్పుడూ వచ్చి ఏస్కోటలో పెత్తనం చేయడం ఈయన లేనప్పుడు నియోజకవర్గం పెత్తనాలు తమ్ముడు రమేష్ కు అప్పగించడం ఇవన్నీ ఆయన్ను ప్రజలకు దూరం చేశాయి.

అప్పుడు జగన్ హవాలో గెలిచేసారు కానీ ప్రజల్లో నిలవదు కష్టం ఐంది. అన్నిటికన్నా ప్రజలను, అధికారులను స్థానిక నాయకులను కలుపుకుని వెళ్లడం ఈయనకు కుదరడం లేదు. దీంతో ఆయనకు నియోజకవర్గం మీద పట్టు తప్పింది.

అంతేకాకుండా మేజర్ మండల పరిషత్ లు అయినా వేపాడ, కొత్తవలస మండల పరిషత్ అధ్యక్ష పదవులు అయన రైవల్ వర్గం ఎత్తుకుపోవడం శ్రీనివాస కు మరింత ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా తమ్ముడు రమేష్ బాధ్యత లేకుండా అధికారం చెలాయించడం, భూ కబ్జాలు వంటివి ఎమ్మెల్యేకు మరింత అప్రదిష్టను తెచ్చి పెట్టాయి.

ఇదిలా ఉండగా మొన్న ఆమధ్య ఎమ్మెల్సీ పోస్ట్ దక్కించుకున్న రఘురాజు దూకుడు ఎక్కువైంది. అయన ఎస్. కోటలో స్థానికంగా ఉంటూ ప్రజల్లో ఉంటూ మెల్లగా ఎమ్మెల్యేకు పొగబెడుతున్నారు. ఆయన స్థానికంగా ఉండడం. స్థానిక నాయకులతో నిత్యముసంబంధాలు నెరుపుతూ తన పట్టును పెంచుకుంటున్నారు. దీంతో అనివార్యంగా లోకల్ క్యాడర్ ఇంకా ప్రజలు సైతం ఆయనకు అనుకూలంగా మారుతూ ఎమ్మెల్యేకు అనివార్యంగా వ్యతిరేకంగా మారుతున్నారు.

ఇక రఘురాజు అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తూ శ్రీనివాస్ కు తలనొప్పిగా మారుతూ తన వర్గాన్ని దూకుడుగా పరుగెత్తిస్తున్నారు. ఇదే తరుణంలో ఏస్కోటలో కొంతమంది ప్రజలు శ్రీనివాస్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వద్దు.. జగన్ ముద్దు అంటూ పోస్టర్స్ వేయడం గమనార్హం. అయితే ఈ పోస్టర్ల వెనుక రఘురాజు ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మాత్రం తనకు ఏమీ తెలీదని, ఎమ్మెల్యే మీద ప్రజలకు నమ్మకం పొతే తానేం తనకేం బాధ్యత అన్నట్లుగా ఉన్నారు.

మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో స్థానికేతరుడు అయినా కడుబండి శ్రీనివాస్ కు వ్యతిరేకత మెల్లగా రాజుకునేలా తెరవెనుక పావులు కదుపుతున్న నాయకులూ ఉన్నారు. ఈసారి ఏస్కోట నియోజకవర్గానికి చెందిన వాళ్లకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ సైతం మెల్లగా రాజుకుంటోంది. చూడాలి ఇది పెద్ద మంటగా మారుతుందా .. చప్పున చల్లారిపోతుందా చూడాలి .. మరోవైపుకి మొన్న ఓడిపోయినా లలిత కుమారి ఈసారి తనను గెలిపించండి అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు.