కేసీఆర్ మీటింగ్‌కు నో పర్మిషన్.? ఎందుకంటే..
కృష్ణానది ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగింతపై నెలకొన్న వివాదం నేపథ్యంలో నల్లగొండలో బీఆరెస్ బహిరంగ సభకు అనుమతి అనుమానంగా కనిపిస్తున్నది.

- నల్లగొండలో అమల్లోకి పోలీస్ ఆంక్షలు
విధాత: కృష్ణానది ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగింతపై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ నెల 22న నల్లగొండలో బీఆరెస్ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సభను విఫలం చేయడంపై దృష్టి పెటిటంది. నల్లగొండ జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలుల పెడుతున్నట్లుగా ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి మీరంటే మీరే అప్పగించారంటూ బీఆరెస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం సాగుతుంది. ఇప్పటికేఇ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దక్షిణ తెలంగాణకు, ఉమ్మడి నల్లగొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి అన్యాయం చేసిన కేసీఆర్ జిల్లాకు వేస్తే తరిమికొడుతామని, ఈ సందర్భంగా ఏం జరిగినా మాది బాధ్యత కాదంటూ హెచ్చరించారు. అటు బీఆరెస్ సైతం సభ పెట్టి తీరాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో పోలీసుశాఖ ఆంక్షల ప్రకటనతో బీఆరెస్ సభకు అనుమతి అనుమానంగా కనిపిస్తున్నది.