‘థ్యాంక్స్’ చెప్పలేదని వివాదం.. షాప్‌ యజమాని హత్య

విధాత : అమెరికాలో దారుణం జ‌రిగింది. షాపు య‌జ‌మానికి, కొనుగోలుదారుడికి మ‌ధ్య థ్యాంక్స్ విష‌యంలో జ‌రిగిన వివాదం హ‌త్య‌కు దారి తీసింది. న్యూయార్క్‌లోని పార్క్ స్లోప్‌లో ఉన్న బ్రూక్లిన్ స్మోక్ షాప్‌కి మంగ‌ళ‌వారం రాత్రి 10:20 గంట‌ల స‌మ‌యంలో ఓ యువ‌కుడు వెళ్లాడు. అయితే షాపు య‌జ‌మాని ఆ యువ‌కుడు రాగానే త‌లుపులు తెరిచాడు. డోర్ తెరిచినందుకు త‌న‌కు థ్యాంక్స్ చెప్పాల‌ని బ్రూక్లిన్ స్మోక్ షాపు య‌జ‌మాని డిమాండ్ చేశాడు. మీరు త‌న కోసం డోర్ తెరిచార‌ని […]

‘థ్యాంక్స్’ చెప్పలేదని వివాదం.. షాప్‌ యజమాని హత్య

విధాత : అమెరికాలో దారుణం జ‌రిగింది. షాపు య‌జ‌మానికి, కొనుగోలుదారుడికి మ‌ధ్య థ్యాంక్స్ విష‌యంలో జ‌రిగిన వివాదం హ‌త్య‌కు దారి తీసింది. న్యూయార్క్‌లోని పార్క్ స్లోప్‌లో ఉన్న బ్రూక్లిన్ స్మోక్ షాప్‌కి మంగ‌ళ‌వారం రాత్రి 10:20 గంట‌ల స‌మ‌యంలో ఓ యువ‌కుడు వెళ్లాడు.

అయితే షాపు య‌జ‌మాని ఆ యువ‌కుడు రాగానే త‌లుపులు తెరిచాడు. డోర్ తెరిచినందుకు త‌న‌కు థ్యాంక్స్ చెప్పాల‌ని బ్రూక్లిన్ స్మోక్ షాపు య‌జ‌మాని డిమాండ్ చేశాడు. మీరు త‌న కోసం డోర్ తెరిచార‌ని తాను భావించ‌ట్లేద‌ని, థ్యాంక్స్ చెప్పే ప్ర‌స‌క్తే లేద‌ని అత‌ను మొండికేశాడు.

ఈ క్ర‌మంలో ఒక‌రికొక‌రు అస‌భ్య‌ప‌దజాలంతో దూషించుకున్నారు. కొట్టుకున్నారు. ఇక‌ నీకు చేత‌నైతే న‌న్ను చంపేయ్ అని య‌జ‌మాని అత‌న్ని రెచ్చ‌గొట్టాడు. షాపు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన యువ‌కుడు త‌న సైకిల్‌లో ఉన్న క‌త్తి బ‌య‌ట‌కు తీసి, య‌జ‌మానిపై పొడిచాడు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ ప‌డుతున్న అత‌న్ని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు.