Etela Rajender | టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ఎమ్మెల్యే ఈటలకు నోటీసులు
Etela Rajender | స్టేట్మెంట్ రికార్డు చేయనున్న పోలీసులు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు బండి బెయిల్ పిటిషన్ పై నేడు వాదనలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో సంచలనం సృష్టించిన టెన్త్ పరీక్షా పత్రం లీకేజీ కేసు విచారణ పోలీసులు వేగం పెంచారు. బుధవారం బండి సంజయ్ ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఈ కేసుకు సంబంధించిన విచారణ చేపట్టడంలో భాగంగా హుజరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కు గురువారం […]

Etela Rajender |
- స్టేట్మెంట్ రికార్డు చేయనున్న పోలీసులు
- దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు
- బండి బెయిల్ పిటిషన్ పై నేడు వాదనలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో సంచలనం సృష్టించిన టెన్త్ పరీక్షా పత్రం లీకేజీ కేసు విచారణ పోలీసులు వేగం పెంచారు. బుధవారం బండి సంజయ్ ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఈ కేసుకు సంబంధించిన విచారణ చేపట్టడంలో భాగంగా హుజరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కు గురువారం నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. రాజేందర్ తో పాటు ఆయన పీఏ కి కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈ నోటీసులపై ఈటల ఏ విధంగా ప్రతిస్పందిస్తాడోనని ఆసక్తి నెలకొంది. టెన్త్ లీకేజీ కేసులో ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
బండి బెయిల్ పిటిషన్ పై నేడు వాదనలు
మరోవైపు నిన్న అరెస్టై కరీంనగర్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై గురువారం హనుమకొండ కోర్టులో వాదనలు జరగనున్నాయి. బుధవారమే బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ గురువారానికి మెజిస్ట్రేట్ వాయిదా వేశారు. దీంతో గురువారం మధ్యాహ్నం బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
లీకేజీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు
టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరంగల్ పోలీసులు చకచకా పావులు కదుపుతున్నారు . ఇప్పటికే ఈ కేసు పై రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కేంద్రీకరించి ఎప్పటికప్పుడు కేసు పురోగతిని తెలుసుకున్నట్లు సమాచారం. వివరాలు తెలుసుకోవడంతో పాటు కేసు కొనసాగించడానికి సంబంధించిన ఆధారాలు సేకరించడం, తదితర విషయాలపై పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి సూచనలు సలహాలు అందజేస్తున్నట్లు చెబుతున్నారు.
దీంతో వరంగల్ పోలీసులు కూడా తమ వేగాన్ని పెంచారు. వీలైనంత తక్కువ సమయంలో కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి అవసరమైన వ్యక్తులను విచారించే క్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగానే ఈటల రాజేందర్ ఆయన పిఏ లకు నోటీసులు జారీ చేసినట్లు భావిస్తున్నారు.
జెట్ స్పీడ్ తో పోలీసుల కదలికలు
మంగళవారం పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడగా సాయంత్రమే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మంగళవారం అర్ధరాత్రి కేసులో కీలక సూత్రధారిగా పోలీసులు భావిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే బీజేసీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ 14 రోజుల రిమాండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్టేట్ మెంట్‌ను వరంగల్ పోలీసులు రికార్డు చేయాలని నిర్ణయించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ప్రశాంత్ నుంచి ఈటలకు టెన్త్ పేపర్
ఎమ్మెల్యే ఈటలకు ప్రశాంత పేపర్ పంపడంతో ఈ విషయంలో పోలీసులు మరింత ఫోకస్ పెట్టారు. కమలాపూర్‌లో పేపర్ లీక్‌పై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అప్ చేశారు. పేపర్ లీక్ కు హుజురాబాద్ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు ఈటల రాజేందర్, ఆయన పీఏకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా, గురువారం బండి సంజయ్ బెయిల్ పిటిషన్ విచారణపై ఉత్కంఠ నెలకొంది.