MUNUGODE: ఒకే ఒక్కడు.. జనరంజకుడు… KA పాల్‌

ఉన్న‌మాట‌: మునుగోడు ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బరిలో 47 మంది అభ్యర్థులు ఉండగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉధృతంగా ప్రచారం చేస్తుండగా స్వతంత్ర అభ్యర్ధులు తమ శక్తి మేరకు పోరాడుతున్నారు. మంగళవారంతో ప్రచారం ముగియనుండడంతో ప్రచారంలో వేగంగా పెంచారు. నేను ఓడిపోతే.. మునుగోడుపై బాంబులే: కేఏ పాల్ ప్రధాన పార్టీలు జనంలోకి ఇంకా ఎలా వెళ్లాలని ఆలోచనలు.. సమాలోచనలు చేస్తూ అందులోనే తలమునకలై ఉన్నారు. ఈటల […]

  • By: Somu    latest    Nov 04, 2022 12:01 AM IST
MUNUGODE: ఒకే ఒక్కడు.. జనరంజకుడు… KA పాల్‌

ఉన్న‌మాట‌: మునుగోడు ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బరిలో 47 మంది అభ్యర్థులు ఉండగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉధృతంగా ప్రచారం చేస్తుండగా స్వతంత్ర అభ్యర్ధులు తమ శక్తి మేరకు పోరాడుతున్నారు. మంగళవారంతో ప్రచారం ముగియనుండడంతో ప్రచారంలో వేగంగా పెంచారు.

నేను ఓడిపోతే.. మునుగోడుపై బాంబులే: కేఏ పాల్

ప్రధాన పార్టీలు జనంలోకి ఇంకా ఎలా వెళ్లాలని ఆలోచనలు.. సమాలోచనలు చేస్తూ అందులోనే తలమునకలై ఉన్నారు.

ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. పరిస్ధితి ఉద్రిక్తం ( వీడియో)

ఇలా ఎవరి గోలలో వారు ఉండగా వారందరిలో ఒకే ఒక్కడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ప్రచార శైలి అందరినీ జనరంజకం చేసింది.

ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్రచారం మునుగోడులో గడపగడపకూ చేరిందో లేదో తెలియదు గానీ పాల్‌ నిర్వహించిన ప్రచారం మునుగోడు నియోజకవర్గమే గాక ప్రపంచంలోని ప్రతి ఇంటికి చేరిందనడంలో అతిశయోక్తి లేదు. అఖరుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు కూడా ఈ వీడియోలను చూసి అనందించారు.. షేర్‌ చేశారు.

ఆయనకు ఎంత మంది ఓటు వేస్తారో తెలియదు. కానీ ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలతో ఆయన చేస్తున్న ప్రసంగాలు, డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ నేను విజయం సాధించేశా.. మెజారిటీ కోసమే ఈ ప్రచారమని తేల్చేశారు.

మునుగోడులో మనమే మొదటి స్థానంలో ఉంటాం రెండో స్థానంలో ఎవరు ఉంటారని జనాలను అడుగుతూ వినోదం పండిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.

ఇక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో, పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం ఉంటే పాల్ మాత్రం ప్రశాంతంగా రోజుకో గెటప్ వేస్తూ.. డ్యాన్సులు చేస్తూ.. జబర్దస్త్ కమెడియన్లను తలపిస్తున్నారు.

ప్రచారంలో భాగంగా మునుగోడులో తనను గెలిపిస్తే అమెరికా చేస్తానని.. ఓడిపోతే అమెరికా నుంచి బాంబులే అంటూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు కామెడీగా స్పందిస్తున్నారు. పప్పు తిన్నాక వచ్చే బాంబులు వేస్తారు అవేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇంకా ఆయన గొర్రెలకాపరి గెటప్‌లో గొంగడి కప్పుకుని గొర్రెలు కాస్తూ, సైకిల్‌ తొక్కుతూ, దోశలు వేస్తూ, చెప్పులు కుడుతూ, పిల్లలతో కలిసి డ్యాన్సులు చేస్తూ జోరుగా ప్రచారం నిర్వహించారు. మొత్తానికి జనం తన గురించి ఏమనుకుంటున్నారో అన్నది పట్టించుకోకుండా తనదైన ప్రత్యేక బాణీలో ప్రచారం చేశారు. మొత్తానికి సీరియస్ సినిమాలో మధ్యమధ్యలో వచ్చే కామెడీ సీన్లు మాదిరిగా పాల్ మాత్రం అందర్నీ నవ్విస్తున్నారు.

నెల రోజులకు పైగా ప్రచారం చేసి అలసిపోయిన అభ్యర్థులు నవంబర్ 6న ఫలితాలు వెలువడిన తర్వాత పాల్ వీడియోలను యూట్యూబ్‌లో చూస్తే కొంత ఉపశమనం కలుగుతుంది అంటున్నారు. ఇదేంది వయా అంటే మాత్రం తనకు కాంగ్రెస్ పార్టీ ఇతర అన్ని పార్టీల మద్దతు తనకే అని ఆల్రెడీ చెప్పేశారు.