Omicron BF.7 | ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ల‌క్ష‌ణాలు ఇవే..

Omicron BF.7 | క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ప్ర‌పంచంపై ప‌డ‌గ విప్పుతోంది. క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కుదుట‌ప‌డుతున్న త‌రుణంలో మ‌రోసారి ఆ మ‌హమ్మారి విజృంభిస్తోంది. చైనా, అమెరికా, ఫ్రాన్స్, జ‌పాన్‌తో పాటు ప‌లు దేశాల్లో క‌రోనా కేసులు ఒక్క‌సారిగా పెరిగాయి. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం కూడా అప్ర‌మ‌త్త‌మైంది. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించాల‌ని, అర్హులైన వారు బూస్ట‌ర్ డోసు వేసుకోవాల‌ని కేంద్రం సూచిస్తుంది. క‌రోనా ముప్పు ఇంకా తొల‌గిపోలేద‌ని, అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. చైనాతో […]

Omicron BF.7 | ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ల‌క్ష‌ణాలు ఇవే..

Omicron BF.7 | క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ప్ర‌పంచంపై ప‌డ‌గ విప్పుతోంది. క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కుదుట‌ప‌డుతున్న త‌రుణంలో మ‌రోసారి ఆ మ‌హమ్మారి విజృంభిస్తోంది. చైనా, అమెరికా, ఫ్రాన్స్, జ‌పాన్‌తో పాటు ప‌లు దేశాల్లో క‌రోనా కేసులు ఒక్క‌సారిగా పెరిగాయి. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం కూడా అప్ర‌మ‌త్త‌మైంది. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించాల‌ని, అర్హులైన వారు బూస్ట‌ర్ డోసు వేసుకోవాల‌ని కేంద్రం సూచిస్తుంది. క‌రోనా ముప్పు ఇంకా తొల‌గిపోలేద‌ని, అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. చైనాతో పాటు ఇత‌ర దేశాల నుంచి ఇండియాకు వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు ఎయిర్‌పోర్టుల్లోనే కొవిడ్ టెస్టులు చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.

మ‌రో మూడు నెల‌ల్లో భారీగా కేసులు..

మ‌రో మూడు నెల‌ల్లో భారీగా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF.7 ల‌క్ష‌ణాలను ఓ సారి లుక్కేద్దాం. జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి, త‌ల‌నొప్పి, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, ముక్కు కార‌డం, ఒళ్లు నొప్పులు, అల‌స‌ట‌, క‌డుపు నొప్పి, విరేచ‌నాలు వంటి ల‌క్ష‌ణాలు ఉంటే ఒమిక్రాన్ కొత్త వేరియంట్ సోకిన‌ట్లుగా భావించొచ్చు. ఈ ల‌క్ష‌ణాలు ఉన్న వారు త‌క్ష‌ణ‌మే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

ఒక్క‌రి నుంచి 10-18 మందికి వ్యాప్తి

ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వేగంగా విస్త‌రిస్తోంది.. దాదాపు ఒక్క‌రి ద్వారా 10 నుంచి 18 మందికి ఈ వేరియంట్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. చైనాలో కేసులు పెర‌గ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని పేర్కొంటున్నారు. కొత్త వేరియంట్ ఇంక్యుబేష‌న్ స‌మ‌యం కూడా చాలా త‌క్కువ అని, ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికీ వేగంగా సోకుతుంది.