Manipur | మ‌ణిపూర్‌లో మ‌రో ఘోరం వెలుగులోకి.. ఆ రోజే ఇద్ద‌రు యువ‌తుల‌పై అత్యాచారం..

Manipur | మ‌ణిపూర్‌లో కుకీ, మైతేయ్ జాతుల మ‌ధ్య చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌లు తీవ్ర ఉద్రిక్తత‌ల‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించిన ఘ‌ట‌న రోజే మ‌రో ఘోరం చోటు చేసుకున్న‌ట్లు స్థానికుల ద్వారా తెలిసింది. కాంగ్‌పోక్పీలో న‌గ్నంగా ఊరేగించిన ఘ‌ట‌న‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ఇద్ద‌రు యువ‌తుల‌పై సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డి హ‌త్య చేసిన‌ట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని కొనుంగ్ మ‌మాంగ్ ఏరియాలో చోటు చేసుకుంది. ప్ర‌త్య‌క్ష‌సాక్షి మాట‌ల్లోనే.. […]

Manipur | మ‌ణిపూర్‌లో మ‌రో ఘోరం వెలుగులోకి.. ఆ రోజే ఇద్ద‌రు యువ‌తుల‌పై అత్యాచారం..

Manipur |

మ‌ణిపూర్‌లో కుకీ, మైతేయ్ జాతుల మ‌ధ్య చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌లు తీవ్ర ఉద్రిక్తత‌ల‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించిన ఘ‌ట‌న రోజే మ‌రో ఘోరం చోటు చేసుకున్న‌ట్లు స్థానికుల ద్వారా తెలిసింది. కాంగ్‌పోక్పీలో న‌గ్నంగా ఊరేగించిన ఘ‌ట‌న‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ఇద్ద‌రు యువ‌తుల‌పై సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డి హ‌త్య చేసిన‌ట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని కొనుంగ్ మ‌మాంగ్ ఏరియాలో చోటు చేసుకుంది.

ప్ర‌త్య‌క్ష‌సాక్షి మాట‌ల్లోనే.. 21, 24 ఏండ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు యువ‌తులు కార్ల వాషింగ్ సెంట‌ర్‌లో ప‌ని చేస్తున్నారు. నేను కూడా వారి స‌హోద్యోగిని. మే 4వ తేదీన కార్ల వాషింగ్ సెంట‌ర్ వ‌ద్ద‌కు వంద‌ల సంఖ్య‌లో అల్ల‌రిమూక‌లు చేరుకున్నాయి.

ఇద్ద‌రు యువ‌తుల‌ను కొంద‌రు మ‌హిళ‌ల సాయంతో అల్ల‌రిమూక‌లు ఓ గ‌దిలో నిర్బంధించారు. వారు గ‌ట్టిగా అర‌వ‌కుండా నోట్లో బ‌ట్ట‌లు కుక్కారు. గంట‌న్న‌ర పాటు ఆ ఇద్ద‌రు యువతుల‌పై అత్యాచారం జ‌రిగింది. ఆ త‌ర్వాత వారిని బ‌య‌ట‌కు లాగి ప‌డేశారు. బాధితులు రక్త‌మోడుతూ క‌నిపించారు. జుట్టు క‌త్తిరించారు. ప‌క్క‌నే ఉన్న క‌ట్టెల మిల్లులో ప‌డేసి వెళ్లిపోయార‌ని స‌హోద్యోగి పేర్కొన్నాడు.

అత్యాచారానికి గురైన అమ్మాయిల్లో ఒక‌రి త‌ల్లి.. సైకుల్ పోలీసుల‌కు మే 16వ తేదీన ఫిర్యాదు చేసింది. దీనిపై జీరో ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఆ త‌ర్వాత కేసును పోరోంప‌ట్ స్టేష‌న్‌కు బ‌దిలీ చేశారు. ఎఫ్ఐఆర్‌లోని వివ‌రాల ప్ర‌కారం.. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను దుండ‌గులు వేధించ‌డంతో పాటు అత్యాచారం చేసి హ‌త్య చేశారు. ఇద్ద‌రు యువ‌తుల మృత‌దేహాలు ఇప్ప‌టివ‌ర‌కు దొర‌క‌లేదు. నిందితులు 200 మంది వ‌ర‌కు ఉన్నార‌ని ఎఫ్ఐఆర్‌లో న‌మోదైంది.