TSPSC: కొన‌సాగుతున్న SIT ద‌ర్యాప్తు.. షమీమ్‌, రమేశ్‌, సురేశ్‌ ఇళ్లలో సోదాలు

విధాత‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్‌ లీకేజీ(Paper Leakage) కేసులో సిట్‌(SIT) దర్యాప్తు కొనసాగుతున్నది. షమీమ్, రమేశ్‌, సురేశ్‌ను సిట్‌ అధికారులు రెండో రోజు ప్రశ్నించారు. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకరలక్ష్మిని సిట్‌ మళ్లీ విచారణకు పిలిచింది. షమీమ్‌, రమేశ్‌ చెప్పిన విషయాలను సిట్‌ నిర్ధారించుకున్నది. షమీమ్‌, రమేశ్‌లకు ప్రవీణ్‌.. ప్రశాంత్‌. సురేశ్‌లకు రాజశేఖర్‌రెడ్డి గ్రూప్‌-1 ప్రశ్నపత్రాలు ఇచ్చినట్టు నిర్ధారించింది. శంకరలక్ష్మి డైరీ నుంచి ప్రవీణ్‌ లాగిన్‌ పాస్‌వర్డ్‌ దొంగిలించాడు. ప్రవీణ్‌కు ప్రశ్నపత్రాలు పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి రాజశేఖర్‌రెడ్డి ఇచ్చాడు. […]

TSPSC: కొన‌సాగుతున్న SIT ద‌ర్యాప్తు.. షమీమ్‌, రమేశ్‌, సురేశ్‌ ఇళ్లలో సోదాలు

విధాత‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్‌ లీకేజీ(Paper Leakage) కేసులో సిట్‌(SIT) దర్యాప్తు కొనసాగుతున్నది. షమీమ్, రమేశ్‌, సురేశ్‌ను సిట్‌ అధికారులు రెండో రోజు ప్రశ్నించారు. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకరలక్ష్మిని సిట్‌ మళ్లీ విచారణకు పిలిచింది. షమీమ్‌, రమేశ్‌ చెప్పిన విషయాలను సిట్‌ నిర్ధారించుకున్నది.

షమీమ్‌, రమేశ్‌లకు ప్రవీణ్‌.. ప్రశాంత్‌. సురేశ్‌లకు రాజశేఖర్‌రెడ్డి గ్రూప్‌-1 ప్రశ్నపత్రాలు ఇచ్చినట్టు నిర్ధారించింది. శంకరలక్ష్మి డైరీ నుంచి ప్రవీణ్‌ లాగిన్‌ పాస్‌వర్డ్‌ దొంగిలించాడు. ప్రవీణ్‌కు ప్రశ్నపత్రాలు పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి రాజశేఖర్‌రెడ్డి ఇచ్చాడు. ఈ కేసులో శంకరలక్ష్మిని సిట్‌ సాక్షిగా చేర్చింది. షమీమ్‌, రమేశ్‌, సురేశ్‌ ఇళ్లలోనూ సిట్‌ సోదాలు చేస్తున్నది.